ప్రలోభాలు, బెదిరింపులకు లొంగక.. ఈటల వైపు నిలబడ్డారు: కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 2, 2021, 6:48 PM IST
Highlights

ఖచ్చితంగా ఈటల రాజేందర్‌ను (etela rajender) గెలిపించుకుంటామని మహిళలు ఘంటాపథంగా చెప్పారని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) . హుజురాబాద్‌లో వేగంగా పథకాలు అమలుతో పాటు రైతులకు పావలా వడ్డీ రుణాలు, రోడ్లు వంటి కార్యక్రమాలు చేపట్టారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులను పంచారని.. అత్యధికంగా హుజురాబాద్‌లోనే రేషన్ కార్డులను మంజూరు చేశారని కేంద్ర మంత్రి ఆరోపించారు. 


ఖచ్చితంగా ఈటల రాజేందర్‌ను (etela rajender) గెలిపించుకుంటామని మహిళలు ఘంటాపథంగా చెప్పారని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) . హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad bypoll) ఫలితంపై ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 60 శాతానికి పైగా మహిళలు భారతీయ జనతా పార్టీని ఆదరించారని ఆయన అన్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేసిందని.. హుజురాబాద్‌లో వేగంగా పథకాలు అమలుతో పాటు రైతులకు పావలా వడ్డీ రుణాలు, రోడ్లు వంటి కార్యక్రమాలు చేపట్టారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులను పంచారని.. అత్యధికంగా హుజురాబాద్‌లోనే రేషన్ కార్డులను మంజూరు చేశారని కేంద్ర మంత్రి ఆరోపించారు. 

హుజురాబాద్‌లో ప్రభుత్వపరంగా చేయని  కార్యక్రమంటూ లేదని.. అడగటమే ఆలస్యమని కిషన్ రెడ్డి అన్నారు. అడిగిన ప్రతి పనిని.. అడగనివి కూడా ఇచ్చారని ఆయన ఆరోపించారు. హుజురాబాద్ కోసం.. ప్రత్యేకంగా వేలాది కోట్ల ప్రాజెక్ట్‌లను ప్రవేశపెట్టారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కానీ ప్రజలు డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా .. డబ్బు, పథకాలు, బెదిరింపులకు లొంగకుండా నిరూపించారని ఆయన ప్రశంసించారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. వందల కోట్లు  ఖర్చు పెట్టాల్సి వుంటుందని తనకు కాస్తంత భయం వేసిందన్నారు. కానీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. అనుకున్నవాళ్లనే గెలిపిస్తామని రుజువు చేశారని కిషన్ రెడ్డి అన్నారు. 

ALso Read:సీనియర్లకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది: హుజూరాబాద్ ఫలితంపై రేవంత్ రెడ్డి

హుజురాబాద్‌లో అధికార దుర్వినియోగం చేశారని.. చివరికి ఎన్నికల సిబ్బందిని సూతం భయపెట్టించారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు ఎవరికైనా అంకితమివ్వాలంటే హుజురాబాద్ ప్రజలకు ఇవ్వాలని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈటల, బీజేపీలపై విశ్వాసం వుంచి ఈ తీర్పు ఇచ్చారని అన్నారు. నైతిక విలువలతో పనిచేసిన రాజకీయ నాయకులు కూడా ఈ తీర్పుతో సంతోషం వ్యక్తం చేస్తారని.. ఇది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా ఆయన అభివర్ణించారు. ధర్మం, నీతి, నిజాయితీకి పట్టం కట్టారని.. అధర్మానికి, అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ (trs), కేసీఆర్ (kcr) చిత్తశుద్ధి పట్ల ప్రజల్లో అనుమానాలున్నాయని ఈ ఫలితం ద్వారా వ్యక్తం చేశారని ఆయన అన్నారు. 

click me!