హైద్రాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం, వాస్తవం ఇదీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Published : Feb 14, 2021, 02:15 PM ISTUpdated : Feb 14, 2021, 02:19 PM IST
హైద్రాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం, వాస్తవం ఇదీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సారాంశం

కేంద్రపాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందని  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటనలో వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు

హైద్రాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందని  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటనలో వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆదివారం నాడు ఈ విషయమై ఆయన స్పష్టత ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ విభజనపై మాట్లాడే సమయంలో హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందని అసదుద్దీన్ ఓవైసీ అనుమానం వ్యక్తం చేశారు.

ఈ విషయమై కిషన్ రెడ్డి ఆదివారం నాడు స్పందించారు. హైద్రాబాద్‌లో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. హైద్రాబాద్ ను యూటీ చేయాలని కేంద్రానికి ఆలోచన లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

also read:హైద్రాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం : అసదుద్దీన్ ఓవైసీ సంచలనం

ఈ విషయమై కేంద్రం సమాధానం చెప్పేలోపుగానే అసద్ పార్లమెంట్ నుండి పారిపోయారని విమర్శించారు. ఎంఐఎం టీఆర్ఎస్ లు అబద్దాలు చెప్పడం అలవాటేనని ఆయన మండిపడ్డారు.హైద్రాబాద్ తో పాటు దేశంలోని పలు నగరాలను కూడ కేంద్రం యూటీలుగా మార్చే అవకాశం ఉందని అసదుద్దీన్ ఓవైసీ అనుమానించారు. బీజేపీ విధానమేనని అసద్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu