
న్యూఢిల్లీ: తనతో కలిసి నాగలి కట్టి పొలం దున్నేందుకు తెలంగాణ సీఎం kcr సిద్దమా అని కేంద్ర మంత్రి Kishan Reddy ప్రశ్నించారు. ఆదివారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను నాగలి కట్టి పొలం దున్నుతానని చెప్పారు. తనతో నాగలి కట్టి కేసీఆర్ పొలం దున్నుతాడా అని కేసీఆర్ కు తాను సవాల్ విసురుతున్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు. Paddy ధాన్యం కొనుగోలు విషయమై కేసీఆర్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. యాసంగిలో పంట మార్పిడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ సహకరిస్తుందన్నారు.
also read:ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో కేసీఆర్ అమీ తుమీ : ఢిల్లీకి టీఆర్ఎస్ మంత్రుల బృందం
వచ్చే రబీలో ధాన్యం కొనుగోలు విషయమై కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి టార్గెట్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలతోనే తెలుగు రాష్ట్రాలకు టార్గెట్ ఇస్తామనిఆయన తేల్చి చెప్పారు. వరి ధాన్యం కొనే బాధ్యత కేంద్రానిదే కాదు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలని ఆయన కోరారు. హింస, ఘర్షణలను ప్రేరేపించేలా మాట్లాడడం కేసీఆర్ కు తగదన్నారు.కల్వకుంట్ల కుటుంబం పాలనపై యువత తమ పౌరుషం చూపించాలని ఆయన కోరారు. రైతులను కేసీఆర్ భయపెడుతూ మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పంటలపై తప్పుదారి పట్టిస్తున్న కేసీఆర్ ను రైతులు ఉరికించాలన్నారు. Bjp పాలనలో హింసకు తావులేదన్నారు. కేసీఆర్ కు కుడి వైపున అసదుద్దీన్, ఎడమ వైపున అక్బరుద్దీన్ ఉన్నారన్నారు.
కేసీఆర్ యాగాలు చేయొచ్చు.. బీజేపీ చేయవద్దా అని ఆయన ప్రశ్నించారు. Telangana ఉద్యమంలో ఏనాడైనా కేసీఆర్ ధర్నాలో పాల్గొనలేదన్నారు. కానీ వరి ధాన్యం కొనుగోలు విషయమై ధర్నా చేశారని ఆయన చెప్పారు. Huzurabad లో బీజేపీ గెలుపు గురించి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ వరి ధాన్యం అంశాన్ని తెర మీదికి తెచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు.
డబ్బుల ప్రవాహనికి హుజూరాబాద్ ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారన్నారు.
వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల ుయద్దం సాగుతుంది. ఈ విషయమై రాజకీయంగా ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ లో వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణకు చెందిన మంత్రులు శనివారం నాడు ఢిల్లీలో మకాం వేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు తదితరులు ఢిల్లీకి వెళ్లారు. యాసంగిలో వరి పంట వేయవద్దని తెలంగాణ ప్రభుత్వం రైతులను కోరింది. అయితే ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రంతో చర్చించేందుకు మంత్రుల బృందం ఢి్లీ బాట పట్టింది. అయితే కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముంబై పర్యటనలో ఉన్నారు. ముంబై నుండి పీయూష్ గోయల్ సోమవారం నాడు ఢిల్లీకి రానున్నారు. కేంద్ర మంత్రి ఢిల్లీకి వచ్చిన తర్వాతే తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రితో భేటీ కానున్నారు.