
కంటోన్మెంట్ భూమలు విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణలోని సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న కంటోన్మెంట్ భూములను జీహెచ్ హెంసీలో వీలినం చేస్తే తాము అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేధికగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రాజ్‌నాథ్‌సింగ్ లకు ట్యాగ్ చేస్తూ ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటోన్మెంట్ భూముల విషయంలో మాట్లాడారని తెలిపారు. కేవలం రెండు రోడ్లను మాత్రం సైనిక అధికారులు మూసేశారని పార్లమెంట్‌లో ప్రకటించారని కానీ అది పూర్తిగా అవస్తావమని తెలిపారు. కిషన్ రెడ్డికి స్థానిక విషయాలు తెలియవని, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో 21 రోడ్లను మూసివేశారని తెలిపారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్లను మూసివేయడంలో సికింద్రబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సైలెంట్ గా ఉంటోందని అరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఆ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉందని అన్నారు. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్‌లో విలీనం చేస్తే తామే దానిని డెవలప్ చేస్తామని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని అన్నారు.
జాతీయ భద్రతకే తొలి ప్రాధాన్యం.. భారత్‌లోనే ఆయుధాల తయారీ..
5 ఏళ్లుగా కోరుతున్న తెలంగాణ..
కంటోన్మెంట్ భూములు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని ఐదేళ్లుగా ప్రభుత్వం కోరుతుంది. టీఆర్ఎస్ మొదటి హాయంలో కూడా ఈ విషయంలో పలు మార్లు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించింది. ఈ ప్రాంతాన్ని తెలంగాణకు బదిలీ చేస్తే వేరే చోట కేంద్రానికి అవసరమైన భూములు ఇస్తామని చెబుతోంది. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదు. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట, ఆదిలాబాద్, నాగ్‌పూర్ వంటి ప్రాంతాలకు ఈ దారి గుండానే వెళ్లాలి. ప్రస్తుతం హైదరాబాద్ విస్తరించడంతో కంటోన్మెంట్ ఏరియా దాటి ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సికింద్రబాద్ కంటోన్మెంట్ కు చెందిన 100 ఎకరాల భూములు ఇస్తే ఆయా ప్రాంతాల రాకపోకల కోసం స్కైవేలు నిర్మించాలని, రోడ్లను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కానీ దేశ భద్రతలో కీలకమైన రక్షణరంగానికి చెందిన భూములు కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదు. అయితే ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం నుంచి వెళ్లే పలు దారులను అధికారులు మూసివేశారు. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అవి పూర్తిగా కేంద్రం చేతిలో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విషయంలో ఏం చేయలేకపోతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్గి ఇటీవల పార్లమెంట్ ప్రకటన చేయడంతో ఈ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది.