తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్

By narsimha lode  |  First Published Oct 9, 2022, 4:40 PM IST

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్ చెప్పారు. ఇవాళ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
 


చౌటుప్పల్: తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు.ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో   గొల్ల, కురుమల ఆత్మీయ సమ్మేళనంలో నిర్వహించిన సమావేశంలో  ఆయన ప్రసంగించారు. 

తెలంగాణ  ఏర్పాటయ్యాక కేసీఆర్  కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు కుటుంబ పాలనకు  చరమ గీతం పాడుతారన్నారు. మునుగోడులో బీజేపీ విజయం సాధించనుందన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా కూడ ప్రజల జీవితాల్లో మార్పులు రాలేదన్నారు. దళిత బంథు పథకం ప్రచారానికి మాత్రమే పరిమితమైందని ఆయన విమర్శించారు.

Latest Videos

undefined

కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ధర్మం కోసం  ప్రతి ఒక్కరూ ధర్మం కోసం పోరాటం చేయాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను తప్పు చేయనందునే మళ్లీ ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నానన్నారు. కేసీఆర్ ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినాకూడా ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ఆయన ధీమాను వ్యక్తంచేశారు. 

మునుగోడులో విజయం సాధించడం కోసం బీజేపీ వ్యూహరచన చేసింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు, కేంద్ర మంత్రులను మునుగోడులో ప్రచారం కోసం ఆ పార్టీ వినియోగిస్తుంది.  మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున బీసీ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రులను  ఆ పార్టీ రంగంలోకి దింపుతుంది.  

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో  మాజీఎంపీ వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది బీజేపీ.  మరో వైపు బీజేపీ తెలంగాణ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జీ సునీల్ భన్సాల్  మునుగోడు పై సమీక్షించారు.  పార్టీ తెలంగాణ ఇంచార్జీ  తరుణ్  చుగ్ కూడ రాష్ట్రంలో మకాం వేశారు. 

also read:మునుగోడు బైపోల్ 2022: చండూరులో రేపు లెఫ్ట్ పార్టీల సభ

 మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్  పార్టీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018 లో విజయం సాధించారు.  ఈ ఏడాది ఆగస్టు 4 వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్టు 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో  చేరారు. 

click me!