అమ్మ లాంటి ఆయా.. మైనర్ బాలుడిని లైంగికంగా వేధించి..!

Published : Sep 17, 2021, 08:07 AM ISTUpdated : Sep 17, 2021, 08:28 AM IST
అమ్మ లాంటి ఆయా.. మైనర్ బాలుడిని లైంగికంగా వేధించి..!

సారాంశం

కాలిన గాయాల గురించి తల్లిదండ్రులు అడిగినా ఆ బాలుడు చెప్పలేదు. ఆ తర్వాత పది రోజులకు మరోమారు ఆ బాలుడిని టాయ్‌లెట్‌కు తీసుకెళ్లి, అసభ్యంగా ప్రవర్తించింది.   

అమ్మ లాంటి ఆయా వృత్తిలో ఉన్న ఓ మహిళ.. మైనర్ బాలుడి పట్ల దారుణంగా ప్రవర్తించింది. బాలుడిని లైంగికంగా వేధించింది. బాలుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ మహిళకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కొత్తపేట బాలాపూర్‌కు చెందిన కె.మల్లేశ్‌ భార్య కె.జ్యోతి(27) 2017 నవంబరు 10న బార్క్‌సలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఆయాగా పనికి కుదిరింది.

 చేరిన పది రోజుల్లోనే.. ఆ స్కూల్‌లో చదువుతున్న తొమ్మిదేళ్ల ఓ బాలుడిని టాయ్‌లెట్‌కు తీసుకువెళ్లింది. ఆ బాలుడి మర్మావయవాలను పట్టుకుని, అసభ్యంగా ప్రవర్తించింది. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రులకు చెబుతానంటూ ఏడవడంతో సిగరెట్‌ లైటర్‌తో అతని చేతి వేళ్లను కాల్చి బెదిరించింది. కాలిన గాయాల గురించి తల్లిదండ్రులు అడిగినా ఆ బాలుడు చెప్పలేదు. ఆ తర్వాత పది రోజులకు మరోమారు ఆ బాలుడిని టాయ్‌లెట్‌కు తీసుకెళ్లి, అసభ్యంగా ప్రవర్తించింది. 

ఆ తర్వాత బాలుడి మానసిక స్థితిలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో ఆయా తీరును వివరించాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. జ్యోతిని అరెస్టు చేశారు. నిందితురాలికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా విధించింది.

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.