
కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 12న ఆయన తెలంగాణకు రానున్నారు. ఆరోజున సంగారెడ్డిలో జరిగే బీజేపీ మేధావుల సదస్సులో ఆయన పాల్గొంటారు.
ఇదిలావుండగా.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతలు మంగళవారంనాడు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాతబండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలపై జాతీయ నాయకత్వం సంతృప్తిని వ్యక్తం చేసిందన్నారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా కూడా తాము సిద్దంగా ఉన్నామని బండి సంజయ్ ప్రకటించారు. రాష్గ్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా గోస కార్యక్రమాలను నిర్వహించనున్నట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే 10 జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ సభలకు మోడీని ఆహ్వనించాలని నిర్ణయించినట్టుగా సంజయ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్టుగా బండి సంజయ్ చెప్పారు.
ALso Read: త్వరలో 10 జిల్లాలో భారీ బహిరంగ సభలు: బండి సంజయ్
బీఆర్ఎస్ కు బీజేపీ మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే ప్రజల ఆలోచనలకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. తమకు నాయకులు లేకపోతే గత ఎన్నికల్లో 119 స్థానాల్లో అభ్యర్ధులను నిలుపుతామా అని సంజయ్ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ తరపున 119 మంది అభ్యర్ధులు ఎలా పోటీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.