తెలంగాణలో బీజేపీ గెలిస్తే .. బీసీ వ్యక్తే సీఎం, మతపరమైన రిజర్వేషన్లు రద్దు : అమిత్ షా సంచలన ప్రకటన

By Siva Kodati  |  First Published Nov 18, 2023, 3:51 PM IST

జాతీయ బీసీ కమీషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీని గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.


జాతీయ బీసీ కమీషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఒవైసీ మెప్పుకోసమే ఉర్దూని రెండో భాషగా గుర్తించిందన్నారు. స్మార్ట్ సిటీస్ కింద నల్గొండకు రూ.400 కోట్లు ఇస్తే ఏం చేశారని అమిత్ షా ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఒవైసీ బెదిరింపులకు లొంగిపోయిందని.. ఆయన ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని అమిత్ షా తెలిపారు.

తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలుగా హోంమంత్రి అభివర్ణించారు. బీజేపీని గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని అమిత్ షా దుయ్యబట్టారు. 

Latest Videos

undefined

ALso REad: కెసిఆర్ నాటిన విత్తనం బీజేపీలో సంజయ్ ని మార్చేసింది.. విజయశాంతి

దళితబంధులో ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, ఆయన కొడుకుని సీఎం చేయడానికి .. సోనియా రాహుల్‌ని ప్రధానిని చేయడానికి ప్రయత్నిస్తున్నారని అమిత్ షా చురకలంటించారు. బీజేపీ గెలిస్తే సీఎం అయ్యేది మా వారసులు కాదన్నారు. బీఆర్ఎస్ నేతలు మిషన్ భగీరథ కింద వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అమిత్ షా ఆరోపించారు. మియాపూర్ భూ కుంభకోణంలో వేల కోట్లు దోచుకుందని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వేల కోట్ల కమీషన్లు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. తమ వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే కుటుంబ పార్టీల లక్ష్యమన్నారు. 

click me!