నాది ఆర్గానిక్ వ్యవసాయమే.. 12 ఆవులు కూడా వున్నాయి: రైతులతో అమిత్ షా

By Siva KodatiFirst Published Aug 21, 2022, 4:26 PM IST
Highlights

ఆర్గానిక్ వ్యవసాయం చేయాల్సిందిగా రైతులను కోరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తన దగ్గర 12 ఆవులు వున్నాయని.. 12 తరాల ఆవు ఒకటి తన వద్ద వుందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. 

తెలంగాణ పర్యటనలో భాగంగా బేగంపేట్ విమానాశ్రయంలో రైతులతో భేటీ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా . ఈ సందర్భంగా విద్యుత్ చట్టంపై రైతులు ఆయన వద్ద ప్రస్తావించారు. విద్యుత్ చట్టం మార్చాలని రైతులు కోరారు. చట్టం కాదు.. ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చాలని అమిత్ షా వ్యాఖ్యానించారు. అలాగే ధాన్యం కొనుగోళ్లు, రుణమాఫీ, ఫసల్ బీమా యోజనపై రైతులతో అమిత్ షా చర్చించారు. ఈ సందర్భంగా గో ఆధారిత సాగు చేయాలని రైతులకు ఆయన సూచించారు. తాను సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని.. 150 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. తన దగ్గర 12 ఆవులు వున్నాయని.. 12 తరాల ఆవు ఒకటి తన వద్ద వుందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. 

ఇకపోతే.. అమిత్ షా తెలంగాణ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అమిత్ షాకు బేగం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అమిత్ షా అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. 

Also Read:సికింద్రాబాద్‌లో బీజేపీ దళిత కార్యకర్త ఇంటికి వెళ్లిన అమిత్ షా..

అనంతరం సికింద్రాబాద్ సాంబమూర్తి నర్‌లో బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి  వెళ్లారు. తమ ఇంటికి వచ్చిన అమిత్ షాకు సత్య నారాయణ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తరుణ్ చుగ్, స్థానిక బీజేపీ కార్పొరేటర్ సత్యనారాయణ నివాసంలోనికి వెళ్లారు. సత్యనారాయణ నివాసంలో అమిత్ షా తేనీరు సేవించారు. అలాగే సత్యనారాయణ కుటుంబ సభ్యులతో ఆయన ముచ్చటించారు. ఇక, సత్యనారాయణ దాదాపు 30 ఏళ్లుగా బీజేపీలో కార్యకర్తగా కొనసాగుతున్నారు. అమిత్ షా తన ఇంటికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా సత్యనారాయణ చెప్పారు. అమిత్ షా రాకపై సత్యనారాయణ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

click me!