శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా.. నోవాటెల్‌లో బీజేపీ నేతలతో భేటీ

Siva Kodati |  
Published : Apr 23, 2023, 05:20 PM ISTUpdated : Apr 23, 2023, 05:42 PM IST
శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా.. నోవాటెల్‌లో బీజేపీ నేతలతో భేటీ

సారాంశం

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇతర కార్యక్రమాలు వుండటంతో అమిత్ షా ఆలస్యంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. 

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కు చేరుకున్న ఆయన తెలంగాణ బీజేపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగియగానే ఆయన చేవేళ్ల బహిరంగ సభకు చేరుకుంటారు. కాగా.. అయితే అమిత్ షా పర్యటనలో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్‌తో అమిత్ షా తేనేటీ విందు కార్యక్రమం రద్దయ్యింది. ఇతర కార్యక్రమాలు వుండటంతో అమిత్ షా ఆలస్యంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. 

ఇకపోతే.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కు చేరుకుని 4 నుంచి 4.30 గంటల వరకు ఆర్ఆర్ఆర్ టీమ్‌తో జరిగే తేనేటీ విందులో పాల్గొంటారు. 4.30 నుంచి 5.10 గంటల వరకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 6 గంటలకు చేవేళ్ల సభకు చేరుకుని 7 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 7.45కి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, 7.50కి ఢిల్లీ బయల్దేరి వెళతారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే