రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత?: కామారెడ్డి కలెక్టర్ పై కేంద్ర మంత్రి నిర్మలా ఫైర్

By narsimha lode  |  First Published Sep 2, 2022, 11:32 AM IST

కామారెడ్డి జిల్లాలోని బీర్కూల్ లో రేషన్ దుకాణాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ బియ్యం సరఫరాలో కేంద్ర ప్రభుత్వ వాటా గురించి కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఈ విషయమై సమాచారం తెలియదని ఆమె చెప్పడంతో నిర్మలా సీతారామన్ ఫైరయ్యారు. 


కామారెడ్డి:రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  కామారెడ్డి కలెక్టర్  జితేష్ పాటిల్ ను ప్రశ్నించారు. అయితే ఈ విషయమై తనకు సమాచారం తెలియదని కలెక్టర్ చెప్పారు. అయితే అరగంటలో సమాచారం తెలుసుకొని చెప్పాలని మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు.  ఐఎఎస్ అధికారిగా  ఉంటూ ఈ సమాచారం తెలియదా అని  కలెక్టర్ తీరుపై కేంద్ర మంత్రి  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  శుక్రవారం నాడు పర్యటించారు. జిల్లాలోని బీర్కూర్  రేషన్ దుకాణాన్ని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తనిఖీ చేశారు.రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పటికీ కూడ రేషన్ దుకాణాల వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్సీలు, లేదా ఫోటోలు ఏర్పాటు చేయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని కేంద్ర మంత్రి కలెక్టర్ ను ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాలోనే తెలంగాణ వ్యాప్తంగా ఇదే రకమైన పరిస్థితి నెలకొందన్నారు.

Latest Videos

undefined

మార్చి 1వ తేదీ నుండి రేషన్ బియ్యం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు చేయడం లేదని  మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా చెప్పారు. రేషన్ దుకాణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని ఆమె ఆదేశించారు.  ప్రధాని మోడీ ఫ్లైక్సీ ఏర్పాటు చేయకపోతే తానే వచ్చి ఫ్లెక్సీ కడతానని కేంద్ర మంత్రి చెప్పారు.రేషన్ బియ్యం సరఫరాలో కేంద్ర ప్రభుత్వం రూ. 30 , రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.30 పైసలు భరిస్తుందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా వివరించారు. 

కేంద్ర మంత్రి కాన్వాయ్ ను అడ్డుకునే యత్నం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం నాడు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ కు చేరుకునే సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డు చెప్పే ప్రయత్నం చేశారు . ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో బీజేపీ శ్రేణులు కూడా కాంగ్రెస్ శ్రేణులు మంత్రి కాన్వాయ్ కు అడ్డుపడకుండా ఎదురు నిలిచారు. 

click me!