జూన్‌ లో పాఠశాలలు ప్రారంభం నాటికే యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు... బీహెఎస్ఎస్ విజ్ఞప్తి..

By SumaBala Bukka  |  First Published Apr 20, 2023, 8:22 AM IST

జూన్ ప్రారంభం నాటికే ప్రభుత్వపాఠశాలల విద్యార్థులకు కొత్త యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందేలా చూడాలని తద్వారా విద్యార్థులు తొందరగా స్కూళ్లకు వచ్చేలా చేయాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం విద్యాశాఖను కోరింది. 


హైదరాబాద్ : నూతన యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు జూన్‌ లో  పాఠశాలలు ప్రారంభం నాటికే  విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలి - బాలల హక్కుల సంక్షేమ సంఘం కోరింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను నూతన యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు  జూన్‌ లో పాఠశాలలు ప్రారంభం నాటికే ప్రారంభం నాటికే విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రికి బాలల హక్కుల సంక్షేమ సంఘం (బీహెఎస్ఎస్) విజ్ఞప్తి చేసిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా గుండు కిష్టయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ లు తెలిపారు. 

గత సంవత్సరం జూన్‌లో యూనిఫాంలు పంపిణీని ప్రారంభిస్తే ఆగస్టు నాటికి పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందాయి. దీనిని అధిగమించడానికి జూన్‌ ప్రారంభం నాటికే యూనిఫామ్స్‌తో విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇవ్వడం ఎలాగూ తప్పదు కదా! ఆ ఇచ్చేది ఏదో సకాలంలో ఇస్తే అంటే జూన్ ప్రారంభం నాటికే ఇస్తే.. విద్యార్థులు అందరూ ఓకే రోజు అంటే పాఠశాలలు ప్రారంభం రోజున ధరించి వస్తారనీ, అది పాఠశాల విద్యాశాఖకు ఒక కొత్తదనాన్ని, విద్యార్థులు వారి  తల్లిదండ్రులకు ఉత్సాహాన్ని ఇస్తుందని వారాన్నారు. 

Latest Videos

undefined

Hyderebad: జీవితంపై విసుగు.. హైదరాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం మానేసి కూలీ అవతారం
      
6, 7 తరగతుల బాలురకు నెక్కర్లు కాకుండా ప్యాంట్స్ ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే 6, 7 తరగతుల బాలురు నెక్కర్లు వేసుకోవడానికి ఇష్టపడడం లేదు. కనుక ఈ సారి అలా కాకుండా 6, 7 తరగతుల బాలురకు కూడా ప్యాంట్స్ ఇవ్వగలరని కోరుతున్నామన్నారు. దాంతో పాటు యూనిఫాంలు కుట్టడానికి ఇచ్చే బట్ట గత సంవత్సరంలో నాణ్యత లేనిది ఇచ్చారు. నాణ్యమైన బట్ట ఇవ్వాలని వారు కోరారు.

అదేవిధంగా పాఠ్యపుస్తకాలు కూడా సకాలంలో జూన్ ప్రారంభం నాటికే విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. మన ఊరు-మన బడికి సంబంధించిన పనులన్నీ ఈ వేసవి సెలవుల్లోనే  పూర్తిచేయించగలరని కోరుతున్నామని.. . బీహెఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా గుండు కిష్టయ్య ( 9948335870 ), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ (9866102962) అన్నారు. 

click me!