ఉద్యోగం రావడం లేదని పురుగుల మందు తాగిన కేయూ విద్యార్థి బోడ సునీల్ నాయక్ నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ సమీపంలోని తేజావత్ సింగ్ తండాకు చెందిన బోడ సునీల్ నాయక్ డిగ్రీ వరకు చదువుకున్నాడు.

ఐదేళ్లుగా పోలీస్ ఉద్యోగానికి సిద్దమవుతున్నాడు. 2016లో అర్హత సాధించినా, శరీర దారుడ్యంలో పోయాడు. దీంతో హన్మకొండలోని నయీంనగర్ గది అద్దెకు తీసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు పెంచడంతో నిరాశ చెందాడు. ఉద్యోగాలు భర్తీ చేయదని మనస్థాపంతో పురుగుల మందు తాగాడు. కేయూ క్రీడా మైదానంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. నేను చేతకాక చావడం లేదు నా చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలి.. అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు.
ఇది గమనించిన కేయూ పోలీసలు వెంటనే అతన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడ్నుండి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం అతను మృతి చెందాడు.