మామిడి తోటలోకి చిన్నారులను కొట్టి, పేడ తినిపించి.. పైశాచికం.. (వీడియో)

Published : Apr 02, 2021, 02:27 PM IST
మామిడి తోటలోకి చిన్నారులను కొట్టి, పేడ తినిపించి.. పైశాచికం.. (వీడియో)

సారాంశం

తొర్రూరు శివారులోని మామిడి తోటలో మామిడి కాయలు తెంపరని తూర్పాటి హర్షిత్(13), వినుగొండా సోహెల్ (16) అనే ఇద్దరు మైనర్లను కట్టేసి చితక బాది, పేడ తినిపించిన ఘటన కలకలం రేపింది. 

తొర్రూరు శివారులోని మామిడి తోటలో మామిడి కాయలు తెంపరని తూర్పాటి హర్షిత్(13), వినుగొండా సోహెల్ (16) అనే ఇద్దరు మైనర్లను కట్టేసి చితక బాది, పేడ తినిపించిన ఘటన కలకలం రేపింది. 

"

మామిడి తోటకు కాపలాగా ఉన్న యాకుబ్ మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి కాళ్లు, చేతులు కట్టేసి చితకబాదుతూ, బలవంతంగా పేడ తినిపించారు. అయితే ఈ చిన్నారులు తప్పిపోయిన కుక్కను వెతుకుతూ మామిడి తోటలోకి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

మహబూబాబాద్ జిల్లా, తొర్రురు మండల కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన బేడ బుడగజంగాల బాలురు ఇద్దరు తప్పి పోయిన కుక్క కోసం గాలిస్తూ కంఠాయపాలెంలోని వీరభద్రరావు మామిడి తోటలోకి వెళ్లారు. 

అయితే వారు మామిడికాయలు దొంగతనానికే వచ్చారంటూ కాపలాదారులు వారి కాళ్లుచేతులు కట్టేసి బంధించారు. ఆ తర్వాత బలవంతంగా పేడ తినిపిస్తూ పైశాచికంగా ప్రవర్తించారు. బాలురపై దాడికి పాల్పడిన బానోత్ రాములుపై కేసు నమోదు చేనిసట్టు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !