హైదరాబాద్ నగర శివారులోని కొంపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. భూగర్భ గ్యాస్ పైప్ లైన్ కు లీకేజీ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఇందులో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు.
భూగర్భ గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో హైదరాబాద్ కొంపల్లిలోని సుచిత్ర జంక్షన్ సమీపంలో మంటల చెలరేగాయి. ఉదయం 11.30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్క సారిగా మంటలు చేలరేగడంతో అక్కడున్న ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై సమాచారం అందగానే అగ్నిమాపక యంత్రాలు, డీఆర్ఎఫ్ బృందాలు, భారత్ గ్యాస్ అక్కడికి చేరుకున్నాయి.
Fire from gas pipeline leak at Kompalli-Suchitra junction in pic.twitter.com/PQn0KaAciW
— Uma Sudhir (@umasudhir)సుమారు 12.30 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. కాగా.. హైవే అభివృద్ధి పనుల కారణంగా పైపు పగిలిపోవడంతో మంటలు చెలరేగాయని, ఎవరో సిగరెట్ వెలిగించి విసిరేయడంతో మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.