యువతితో పబ్ కు వెళ్లిన బిగ్ బాస్ విజేత రాహుల్ పై బీర్ బాటిల్స్ తో దాడి

Published : Mar 05, 2020, 07:20 AM ISTUpdated : Mar 05, 2020, 12:42 PM IST
యువతితో పబ్ కు వెళ్లిన బిగ్ బాస్ విజేత రాహుల్ పై బీర్ బాటిల్స్ తో దాడి

సారాంశం

బిగ్‌బాస్-3 విజేత, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పై హైద్రాబాద్ లో ని ఓ పబ్బులో బుధవారం నాడు రాత్రి జరిగింది


హైదరాబాద్: బిగ్‌బాస్-3 విజేత, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పై హైద్రాబాద్ లో ని ఓ పబ్బులో బుధవారం నాడు రాత్రి జరిగింది. తలపై బీరు సీసాలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. గాయం చిన్నదే అంటూ ఆస్పత్రి వైద్యులు అతన్ని డిశ్చార్జీ చేశారు.

బుధవారం నాడు రాత్రి పదకొండున్నర సమయంలో రాహుల్ సిప్లిగంజ్ హైద్రాబాద్ గచ్చిబౌలిలోని పబ్ కు వచ్చాడు. అతనితో పాటు ఓ యువతి, కొందరు స్నేహితులు కూడా ఉన్నారు.

పబ్ కు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల పబ్ లోని కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయమై రాహుల్ వారిని నిలదీశాడు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.ఈ క్రమంలోనే ప్రత్యర్థులు రాహుల్ సిప్లిగంజ్ తలపై బీరు బాటిల్స్ తో దాడికి దిగారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఇదిలా ఉండగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువుల పట్ల అనుచితంగా రాహుల్ సిప్లిగంజ్ ప్రవర్తించాడని దాడికి పాల్పడినవారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడికి దిగినట్టుగా చెబుతున్నారు. 

దాడికి గురైన రాహుల్ సిప్లిగంజ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పోలీసులు పబ్ లో ఉన్న సీసీటీవీపుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అసలు పబ్ లో ఏం జరిగిందనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. పబ్ లోని సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. 
 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu