మోదీని కూడా గుర్తించరా?? ఉబర్ క్యాబ్ మీద నెటిజన్ల ఆగ్రహం.. కారణమేంటంటే..

By AN TeluguFirst Published Apr 2, 2021, 11:13 AM IST
Highlights

ఉబర్ క్యాబ్ మేనేజ్ మెంట్ మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఉబర్ మూసుకోవడం బెటర్ అంటూ విరుచుకుపడుతున్నారు. ఆదార్ కార్డులో ఉన్నట్టు లేడని మోడీని కూడా ఎయిర్ పోర్టులోనే ఆపేసేలా ఉన్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఉబర్ క్యాబ్ మేనేజ్ మెంట్ మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఉబర్ మూసుకోవడం బెటర్ అంటూ విరుచుకుపడుతున్నారు. ఆదార్ కార్డులో ఉన్నట్టు లేడని మోడీని కూడా ఎయిర్ పోర్టులోనే ఆపేసేలా ఉన్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. శ్రీకాంత్ అనే ఓ యువకుడు గత సంవత్సరంన్నరగా  ఉబర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు 1428 ట్రిప్పులు పూర్తిచేశాడు. 4.67 స్టార్ రేటింగ్ ఉన్న డ్రైవర్ అతను. అయితే ఇటీవల అతను తిరుపతికి వెళ్లి తలనీలాలు సమర్పించాడు. 

ఆ తరువాత ఉబర్ క్యాబ్ కు లాగిన్ అవుతుంటే.. కాలేకపోతున్నాడు. ఎందుకు అని కనుక్కుంటే అతని ఫేస్ ను యాప్ రికగ్నైజ్ చేయడం లేదని తెలిసింది. దీనిమీద ఉబర్ కు, యాప్ ను హ్యాండిల్ చేసే సంస్థకు ఎన్నిసార్లు విజ్జప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఇది జరిగి 33 రోజులవుతుంది. ఈ విషయాన్ని షేక్ సలాఉద్దీన్ అనే ఓ వ్యక్తి ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ఉబర్ ఇండియాను కూడా ట్యాగ్ చేశాడు.

దీనికి వెంటనే ఉబర్ ఇండియా టీం రెస్పాండ్ అయ్యింది. ఫేస్ రికగ్నైజ్ వల్ల అతను ఉద్యోగం కోల్పోలేదని, కమ్యూనిటీ గైడ్ లైన్స్  పదేపదే ఉల్లంఘించడం వల్లే అతన్ని బ్లాక్ చేశామని సమాధానం ఇచ్చారు. మొహంలోని గడ్డం, మీసాలు, జుట్టు లేకపోవడం లాంటి మార్పుల్ని ఫేస్ రికగ్నైజ్ యాప్ గుర్తింస్తుందని, దీనిమీద ఇంకా పూర్తి సమాచారం కోసం డ్రైవర్లు సహాయం కోసం పనిచేసే భాగస్వామి సేవా కేంద్రాన్ని సందర్శించవచ్చని ఉచిత సలహా కూడా ఇచ్చింది.

దీంతో నెటిజన్లు మండి పడుతున్నారు.  మీ సంస్థకు సిన్సియర్ గా సంవత్సరంన్నరగా పనిచేస్తున్న డ్రైవర్ 33 రోజులగా బాధ పడుతుంటే.. స్పందించలేదు కానీ.. సోషల్ మీడియాలో రాగానే సర్దుకుంటున్నారు.. అని ఒక నెటిజన్ విరుచుకుపడ్డాడు. 

మరొకరు మీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏంటో చెబితే మేము కూడా ఫాలో అవుతాం కదా అని సెటైర్ వేయగా, వీళ్లు ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఫేస్ రికగ్నైజ్ అవ్వడం లేదని ఆపేస్తారు అంటూ చణుకులు విసిరారు. కొందరైతే వ్యంగ్యమైన మీమ్స్  కూడా పోస్ట్ చేశారు.

click me!