Telangana Crime : పొలాల్లోకి లాక్కెళ్లి మద్యం తాగించి... మైనర్ బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం

Arun Kumar P   | Asianet News
Published : May 13, 2022, 10:52 AM ISTUpdated : May 13, 2022, 11:06 AM IST
Telangana Crime : పొలాల్లోకి లాక్కెళ్లి మద్యం తాగించి... మైనర్ బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం

సారాంశం

ఒకడు అభం శుభం తెలియని మైనర్ ను పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది చూసిన మరొకడు బాలికను కాపాడాల్సింది పోయి వాడుకూడా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వికారాబాద్: తెలుగురాష్ట్రాల్లో ఇటీవల మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మరీ ఎక్కువయ్యాయి. అయినవాళ్లు పరాయివాళ్లు అని తేడాలేకుండా ఆడబిడ్డలపై ఇంటా బయటా లైంగిక దాడులు జరుగుతున్నాయి. ప్రతినిత్యం ఎక్కడో అక్కడ మహిళలు మృగాళ్ల చేతిలో లైంగిక దాడులకు గురవుతున్నారు. కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు మరెంత కఠినంగా వ్యవహరించినా మహిళలు, చిన్నారులకు  రక్షణ కల్పించలేకపోతున్నారు. ఇప్పటికే అనేక  ఘటనలు వెలుగుచూడగా తాజాగా తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. 

వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక (15)పై అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ (19) కన్నేసాడు. యువతిని ఎలాగయినా అనుభవించాలని దుర్భుద్దితో వున్న అతడు సరయిన సమయం కోసం ఎదురుచూసాడు. ఈ  క్రమంలోనే ఇంటిబయట ఒంటరిగా వున్న బాలికను గమనించిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. 

యువతి అరవకుండా చేతితో నోరు మూసి బాలికను బలవంతంగా పక్కనే వున్న పొలాల్లోకి ఎత్తుకెళ్లాడు. అతడి నుండి తప్పించుకోడానికి బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తనతో తెచ్చుకున్న మద్యాన్ని బాలికతో బలవంతంగా తాగించి మత్తులోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలిక అరవకుండా నోటిని అదిమిపట్టి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.    

అయితే బాలికను ప్రవీణ్ లాక్కెళుతుండగా గమనించిన చాకలి రవి వారిని అనుసరించాడు. కామాంధుడి నుండి బాలికను రక్షించాల్సింది పోయి తాను కూడా దారుణానికి ఒడిగట్టాడు. అప్పటికే అత్యాచారానికి గురయి అపస్మారక స్థితిలో వున్న బాలికపై రవి కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

ఇలా ఇద్దరు నీచుల చేతిలో అత్యాచారానికి గురయన బాలిక ఎలాగోలా ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో బాలిక సోదరుడు వెంటనే పరిగి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాదిత బాలికను వైద్యపరీక్షల నిమిత్త తరలించారు. అనంతరం పోక్సో చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

ఇదిలావుంటే ఇటీవల  యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేటలో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. పగటివేళ భర్త పనికి వెళ్లగా వివాహిత ఒంటరిగా వుండటం చూసిన ఓ దుండగుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మొదట వివాహితపై లైంగికదాడికి పాల్పడిన తర్వాత ఆమె అపస్మారక స్థితిలో అచేతనంగా పడివుంటే మరోసారి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ప్రాణాలు తీసి   కాళ్ల పట్టీలు, బంగారు పుస్తెలను దోచుకునే పారిపోయాడు.   

నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన దంపతులు తూప్రాన్ పేటకు వలస వచ్చారు. వారిద్దరూ హైదరాబాద్ - విజయవాడ హైవే సమీపంలోని ఒక గోదాం వద్ద కాపలా దారులుగా ఉంటూ అక్కడే ఉంటున్నారు. భర్త పగటివేళ సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అయితే అతను డ్యూటీ కి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా సమీపంలోని గడ్డివాము దగ్గర విగతజీవిగా రక్తపుమడుగులో, నగ్నంగా పడి ఉంది. దీంతో అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు. 

 మహిళపై అత్యాచారం చేసింది సంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు (24) అని పోలీసులు గుర్తించారు. అతడు సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు బాధితురాలు ఒంటరిగా ఉండటంతో నిందితుడు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.   గోదాం దగ్గరకు వెళ్లి ఆమెపై లైంగికదాడి యత్నం చేయడంతో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసి ఉంటుందని,  అక్కడినుంచి పట్టుకుని గడ్డివాము సమీపంలోకి లాక్కొచ్చి లైంగిక దాడి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. లైంగిక దాడి అనంతరం బాధితురాలు పరుగెత్తుతుండగా కర్రతో తలపై బలంగా మోది చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్