ఉద్యోగం రాలేదని.. వేర్వేరు చోట్ల ఇద్దరు యువకుల బలవన్మరణం..

Published : Mar 03, 2022, 07:21 AM IST
ఉద్యోగం రాలేదని.. వేర్వేరు చోట్ల ఇద్దరు యువకుల బలవన్మరణం..

సారాంశం

తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తాజాగా రెండు వేర్వేరు చోట్లు ఇద్దరు యువకులు ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు స్థానికంగా విషాదాన్ని నింపాయి. 

ఖమ్మం : ఉద్యోగం రాలేదని మనస్థాపంతో Khammam, Vemulawadaలలో ఇద్దరు యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు,  బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోదాడకు చెందిన  అల్లిక వేణు (22), 2020లో ఖమ్మంలో డిగ్రీ పూర్తి చేశాడు. తన మిత్రుడికి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చి తనకు రాలేదని బాధపడుతున్నాడు. నాలుగు రోజుల కిందట ఖమ్మం వచ్చి ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్నాడు. బుధవారం గదిలో తాడుతో ఉరి వేసుకుని suicide చేసున్నాడు. దీనిపై యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని కాషాయపల్లిలో గోస్కుల ప్రశాంత్ (23) ఉరివేసుకొని మృతి చెందాడు. ఇతడి తల్లిదండ్రులు  గోస్కుల బాబు, రేణుకలది వ్యవసాయ కుటుంబం.  ప్రశాంత్ 2020లో డిగ్రీ పూర్తిచేసి Army, Police Constable ఉద్యోగాల కోసం శిక్షణ పొందాడు. job రావడం లేదంటూ కొద్దిరోజులుగా మనస్తాపం చెందుతున్నాడు. బుధవారం తమ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేష్ తెలిపారు. 

ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఎంతకూ భర్తీ నొటిఫికేషన్లు వెలువడక నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. ఇలాగే నిరుడు నవంబర్ 7న ఇంకెప్పుడు ఉద్యోగం సాధిస్తావంటూ కుటుంబసభ్యులు, స్నేహితుల ఒత్తిడి ఎక్కువవడంతో ఓ నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.  

telangana రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని భావించి చాలామంది యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇలా ఏళ్లుగా ప్రిపరేషన్ సాగిస్తున్నా అడపాదడపా కొన్ని నోటిఫికేషన్లు తప్ప అందరూ ఊహించినట్లుగా భారీగా ఉద్యోగాల భర్తీ మాత్రం జరగలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆశ పెట్టుకున్న నిరుద్యోగ యువత ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  

నల్గొండ జిల్లాలో unemployed youth suicide కు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. nalgonda district చందంపేట మండలం గువ్వలగుట్ట గ్రామానికి చెందిన సపావట్ బూర, కమ్మ దంపతుల కుమారుడు నరేష్(30) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలన్న పట్టుదలతో ప్రిపరేషన్ ప్రారంభించాడు. hyderabad లో వుంటూ శిక్షణ తీసుకున్న అతడు కొన్నేళ్ళుగా ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నిస్తూనే వున్నాడు. 

కొన్నాళ్లక్రితమే తండ్రి చనిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడినా నరేష్ ప్రిపరేషన్ మాత్రం కొనసాగిస్తూనే వున్నాడు. ఈ క్రమంలో తాజాగా దీపావళి పండగ కోసం స్వగ్రామానికి విచ్చేసిన అతడికి కుటుంబసభ్యులు, స్నేహితుల నుండి తీవ్ర ఒత్తిడి ఎదురయ్యింది. ఇంకెంతకాలం చదువుతావు... ఉద్యోగం ఎప్పుడొస్తుంది... నీకంటే చిన్నోళ్ల పెళ్లిళ్లు అయిపోతున్నాయి.... నువ్వు ఎప్పుడు చేసుకుంటావ్ అంటూ   వారు అడగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 

తీవ్ర మనస్తాపానికి గురయిన నరేష్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రలో వుండగా సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందే ''అమ్మా నన్ను క్షమించు... నేను నాన్న దగ్గరకు వెళ్లిపోతున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు. నాకు బతకాలని లేదు. అందకే ఆత్మహత్య చేసుకుంటున్నా'' అంటూ సూసైడ్ లెటర్ రాసిపెట్టాడు.  

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో నిరుద్యోగి ఆత్మహత్యతో నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. 

ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం బబ్బెరు చెలక గ్రామానికి చెందిన అసంపల్లి మహేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ ట్రైనింగ్ చేసిన మహేష్ కొన్నాళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు. అయినా ఫలితం లేక పోవడం తో మనస్తాపానికి లోనయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మరువకముందే మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?