దుప్పట్లో చుట్టిన మహిళ మృతదేహం తీసుకెళ్తూ పట్టుబడిన ఇద్దరు యువకులు

Published : Sep 24, 2021, 07:25 AM IST
దుప్పట్లో చుట్టిన మహిళ మృతదేహం తీసుకెళ్తూ పట్టుబడిన ఇద్దరు యువకులు

సారాంశం

హైదరాబాదులోని హయత్ నగర్ వద్ద దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మృతదేహాన్ని తీసుకుని వెళ్లి చెరువులో పడేయడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హయత్ నగర్ లో ఓ మహిళ మృతదేహం తీవ్ర కలకలం సృష్టించింది. ఓ మహిళ మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి తీసుకుని వెళ్లి చెరువులో పడేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకున్నారు.

ఆ ఘటన హయత్ నగర్ సమీపంలోని బాతుల చెరువు వద్ద చోటు చేసుకుంది. అనుమానం వచ్చిన స్థానికులు ఆ యువకులను పట్టుకున్నారు. యువకుల తీరు సరిగా లేకపోవడంతో, తాము అడిగిన ప్రశ్నలకు వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో స్థానికులకు వారిపై అనుమానం పెరిగింది.

వారు తీసుకుని వెళ్తున్న మహిళ మృతదేహంపై దుస్తులు లేకపోవడంతో వారి అనుమానం మరింత పెరిగింది. దీంతో యువకులకు స్థానికులు దేహశుద్ధి చేసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.  

ఇటీవల హైదరాబాదులోని సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడు రాజు బాలికును ఇంట్లోకి పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడని, ఆ తర్వాత హత్య చేసి శవాన్ని పరుపులో చుట్టాడని తేలింది. నిందితుడు రాజు వరంగల్ స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై శవమై తేలాడు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu