24 గంటల్లో 247 మందికి పాజిటివ్, తెలంగాణలో 6,64,411కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Sep 23, 2021, 08:58 PM ISTUpdated : Sep 23, 2021, 09:00 PM IST
24 గంటల్లో 247 మందికి పాజిటివ్, తెలంగాణలో 6,64,411కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 247 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 315 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,909 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 51,521 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 247 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,64,411కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో వైరస్ వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,909కి చేరింది. 

ఒక్కరోజు వ్యవధిలో 315 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,55,625కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 4,877 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 71 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 9, జీహెచ్ఎంసీ 71, జగిత్యాల 8, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 1, కామారెడ్డి 0, కరీంనగర్ 21, ఖమ్మం 17, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 6, మంచిర్యాల 7, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 13, ములుగు 1, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 14, నారాయణపేట 0, నిర్మల్ 2, నిజామాబాద్ 4 , పెద్దపల్లి 10, సిరిసిల్ల 4, రంగారెడ్డి 9, సిద్దిపేట 3, సంగారెడ్డి 1, సూర్యాపేట 9, వికారాబాద్ 1, వనపర్తి 4, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్ 13, యాదాద్రి భువనగిరిలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి.


 

PREV
click me!

Recommended Stories

ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu
హైదరాబాద్ కు 50 కి.మీ దూరంలో మరో కూకట్ పల్లి.. ఇక్కడ రూ.40-50 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్, భవిష్యత్ లో అయితే కోట్లు..!