పాతబస్తీలో దారుణం : గుంతను తప్పించబోయి.. లారీకింద పడి.. యువకుల దుర్మరణం

Published : Feb 15, 2021, 09:15 AM IST
పాతబస్తీలో దారుణం : గుంతను తప్పించబోయి.. లారీకింద పడి.. యువకుల దుర్మరణం

సారాంశం

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. రోడ్డుమీద పడ్డ గుంత ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. పాతబస్తీ మీర్‌చౌక్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. 

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. రోడ్డుమీద పడ్డ గుంత ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. పాతబస్తీ మీర్‌చౌక్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. 

హైదరాబాద్, పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజీబీఎస్ బస్సు స్టేషన్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఫసీఖాన్ (19), మోసిన్(23) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. 

వీరిద్దరూ టూ వీలర్ మీద ఓ ఫంక్షన్ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో రోడ్డు  మీద ఉన్న గుంతను తప్పించబోయి బండి మీదినుంచి ఒక్కసారిగా కింద పడ్డారు. ఆ టైంలో ఎదురునుండి వచ్చిన లారీ వీరి మీదినుంచి దూసుకుపోయింది. దీంతో వీరిద్దరూ స్పాట్ డెడ్ అయ్యారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకులు చాదర్‌ఘాట్‌ మూసానగర్ కు చెందినవారని పోలీసులు గుర్తించారు. 

ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అహ్మాద్ బలాల మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

PREV
click me!

Recommended Stories

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud