ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు గల్లంతు

Published : Feb 15, 2021, 08:29 AM IST
ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు గల్లంతు

సారాంశం

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కారు అతి వేగంగా ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు గల్లంతయ్యారు.

జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో నలుగురు ఉన్నారు. వారిలో ఒకరు ఈత కొడుతూ బయటకు వచ్చారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.

గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మేడిపల్లి - కట్లకుంట మధ్యలో ఆ ప్రమాదం జరిగింది. అమరేందర్ అనే న్యాయవాది కుమారుడు ఈత కొడుతూ బయటకు వచ్చాడు. నలుగురు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. 

వారంతా ఓ జాతరకు బయలుదేరారు. కారు అతి వేగంగా కాలువలోకి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?
బిఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్... ఏమిటీ ప్లెక్సీ వివాదం?