తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు: జయేష్ రంజన్‌‌ పోటీకి లైన్ క్లియర్

By narsimha lodeFirst Published Feb 7, 2020, 4:07 PM IST
Highlights

తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జయేష్ రంజన్  తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


హైదరాబాద్: తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో జయేష్ రంజన్ పోటీ చేసేందుకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది.  జయేష్ రంజన్ నామినేషన్‌ను తిరస్కరించడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీంతో జయేష్ రంజన్ పోటికి గ్రీన్ సిగ్నల్ లభించింది.

Also read:హైద్రాబాద్‌లోనే తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు:హైకోర్టు

తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి జయేష్ రంజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే క్యాట్ ఆమోదం లేని కారణంగా జయేష్ రంజన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.   రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఉండడంతో  నామినేషన్‌ను ఆమోదించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు  తేల్చి చెప్పింది.

తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి,  జయేష్ రంజన్  నామినేషన్లను  తిరస్కరించారు ఎన్నికల అధికారులు. నామినేషన్ పత్రంలో పొరపాట్లు ఉన్న కారణంగా జితేందర్ రెడ్డి నామినేషన్ ను తిరస్కరించారు. రంగారావు నామినేషన్ ఒక్కటే ఏకగ్రీవంగా ఎన్నికౌతారని భావించారు.

అయితే  జగన్మోహాన్ రావు వర్గం హైకోర్టులో జయేష్ రంజన్ నామినేషన్ తిరస్కరణపై హైకోర్టును ఆశ్రయించింది.  జయేష్ రంజన్ నామినేషన్ తిరస్కరించడంపై హైకోర్టులో  జగన్మోహాన్ రావు వర్గం పిటిషన్‌పై శుక్రవారం నాడు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

9వ తేదీన అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో  పోటీ రంగారావుతో జయేష్ రంజన్ పోటీ పడతారు.గతంలోనే న్యూఢిల్లీలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడాన్ని కూడ హైకోర్టు తప్పుబట్టింది. ఎన్నికలను హైద్రాబాద్‌లోనే నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
 

click me!