నాలుగేళ్ల హైదరాబాద్ బాలికపై జార్ఖండ్ బాలుడి అత్యాచారయత్నం

Published : Jul 18, 2018, 05:21 PM ISTUpdated : Jul 18, 2018, 05:23 PM IST
నాలుగేళ్ల హైదరాబాద్ బాలికపై జార్ఖండ్ బాలుడి అత్యాచారయత్నం

సారాంశం

సినిమాల ప్రభావమో, తల్లిదండ్రుల నిర్లక్ష్యమో ఏమోగానీ చిన్న వయస్సులోనే పిల్లలు దారుణాలకు పాల్పడుతున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో అనేకం బైటపడుతున్నాయి. ఏం చేస్తున్నారో కూడా తెలియని వయసులో చిన్నారులు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది.  

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్ కు వలస వచ్చింది. వీరు సికింద్రాబాద్ సమీపంలోని ముషీరాబాద్ ప్రాంతంలో నివాసముంటున్నారు. అయితే ఈ కుటుంబానికి చెందిన అజయ్ కుమార్(14) అనే మైనర్ బాలుడు ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే ప్రాంతంలో నివాసముండే ఓ నాలుగేళ్ల చిన్నారిపై అజయ్
అత్యాచారయత్నం చేశాడు. అతడు చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వికృతంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిపోయిన చిన్నారి గట్టిగా కేకలు వేస్తూ ఏడవటం ఆరంభించింది. దీంతో కొందరు అటువైపు రావడం గమనించిన నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు.

ఈ విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోం కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu
THROWBACK : అసెంబ్లీలో కేసీఆర్ Vs రేవంత్ రెడ్డి | KCR VS Revanth Reddy In Telangana Assembly