ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్న కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వేగంగా వెళుతున్న బైక్ కు కారు డోర్ తగలడంతో ప్రమాదం జరిగి రెండేళ్ల చిన్నారి మృతిచెందింది.
హైదరాబాద్ : కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. రోడ్డుపైనే కారు ఆపి వెనకాల చూసుకోకుండా ఒక్కసారిగా కారు డోర్ తీయడంతో ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు కూతురితో కలిసి బైక్ పై వెళుతుండగా కారు డోర్ తగిలి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతిచెందగా తల్లి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. చిన్నారి తండ్రి మాత్రం గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్బీనగర్-మన్సురాబాద్ మార్గంలో రెండేళ్ళ ధనలక్ష్మి తల్లిదండ్రులతో కలిసి బైక్ పై వెళుతోంది. అయితే ఇదేమార్గంలో వెళుతున్న ఓ కారును డ్రైవర్ సడన్ గా రోడ్డుపై ఆపాడు. కారులోంచి ఓ వ్యక్తి దిగి వెళ్లిపోగా ఏదో పనిపై డ్రైవర్ కిందకు దిగేందుకు ప్రయత్నించాడు. వెనకాల బైక్ వస్తున్న విషయాన్ని గమనించకుండా అతడు ఒక్కసారిగా కారు డోర్ తీసాడు. దీంతో బైక్ పై వెళుతున్న ధనలక్ష్మితో పాటు తల్లిదండ్రులు కిందపడిపోయారు.
Read More బాలింత భార్య సెక్స్ కు ఒప్పుకోలేదని... కిరాతకంగా చంపిన కామాంధుడు
కారు డోర్ తగిలి బైక్ అదుపుతప్పడంతో కిందపడిపోయిన రెండేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నారి తల్లి శశిరేఖ కూడా తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. తండ్రి సయ్యద్ మాత్రం స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడినుండి పరారయ్యాడు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతికి కారణమైన కారు డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు సీజ్ చేసారు.