బాలింత భార్య సెక్స్ కు ఒప్పుకోలేదని... కిరాతకంగా చంపిన కామాంధుడు

లైంగిక వాంఛ తీర్చలేదని నెలరోజుల  క్రితమే బిడ్డకు జన్మనిచ్చిన బాలింత భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు ఓ కసాయి భర్త. 

Husband brutally killed wife in  Hyderabad AKP

హైదరాబాద్ : బిడ్డకు జన్మనిచ్చి నెలరోజులు కూడా కాకముందే బాలింత భార్యకు శారీరకంగా దగ్గరవ్వాలని ప్రయత్నించాడు భర్త. కానీ అందుకు బాలింత భార్య అంగీకరించకపోవడంతో కామవాంఛతో రగిలిపోతూ విచక్షణ కోల్పోయిన అతడు దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యపై ప్రేమ, జాలి చూపకుండా కోరిక తీర్చలేదన్న కోపంతో గొంతునులిమి హతమార్చాడు. ఈ దారుణం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. 

పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం... సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యభర్తలు నివాసముండేవారు. వీరికి ఇద్దరు బిడ్డలు సంతానం. నెలరోజుల క్రితమే మహిళ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బాలింత భార్యతో లైంగికంగా దగ్గరవ్వాలని భావించాడు భర్త. కానీ అందుకు భార్య ఒప్పుకోకపోవడంతో గొంతునులిమి చంపేసాడు. అనంతరం తనకేమీ తెలియనట్లుగా నాటకమాడాడు. 

రాత్రి ఒక్కసారిగా బాలింత భార్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యిందని... వెంటనే హాస్పిటల్ కు తరలించినా పరిస్ధితి విషమించి మృతిచెందిందని కుటుంబసభ్యులు, బంధువులను అతడు నమ్మించాడు. కానీ అల్లుడి మాటలు అనుమానాస్పదంగా వుండటంతో మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో రంగంలోకి దిగిన సైదాబాద్ పోలీసులు వివాహిత గొంతుపై గాయాలను గుర్తించారు. వెంటనే మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. 

Read More  కామారెడ్డి జిల్లాలో దారుణం: బైక్ పై తీసుకెళ్లి మహిళపై అత్యాచారం

బాలింత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆ రిపోర్ట్ కూడా హత్యగానే తేల్చింది. దీంతో సదరు భర్తపై హత్యతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు పోలీసులు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా అంత్యక్రియలు పూర్తిచేసారు. 

ఇలా క్షణకాలం సుఖంకోసం హాయిగా సాగుతున్న సంసారాన్ని నాశనం చేసుకున్నాడు. తల్లి మృతిచెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు కన్నవారి ప్రేమకు దూరమై అనాధలుగా మారారు. తల్లి మృతదేహం వద్ద చిన్నారుల ఏడుపు చూసేవారికీ కన్నీరు తెప్పిస్తోంది. 

    


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios