మునుగోడులో టీఆర్ఎస్ విజయానికి కారణాలు.. టాప్ పాయింట్స్

By Mahesh KFirst Published Nov 7, 2022, 1:47 PM IST
Highlights

మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ ఉపఎన్నికలో గులాబీ పార్టీ విజయం సాధించడానికి కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ప్రచార వ్యూహం మొదలు, పొత్తులు, ఎత్తుల, ఇతర కీలక విషయాలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.
 

హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. బీజేపీ శాయశక్తులా ప్రయత్నించినా అధికార పార్టీ టీఆర్ఎస్ ఈ స్థానాన్ని ఎగరేసుకెళ్లింది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీని కాంగ్రెస్ కూడా తట్టుకోలేకపోయింది. ఒకరిపై ఒకరు భీకర ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ పోలింగ్ నమోదు అయ్యే వరకు ఎన్నిక వ్యూహాలను టీఆర్ఎస్, బీజేపీలు అమలు చేశాయి. చివరకు టీఆర్ఎస్ పై చేయి సాధించింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ గెలవడానికి గల కీలక అంశాలను పరిశీలిద్దాం. ఈ కింద పేర్కొన్న అంశాలు టీఆర్ఎస్ గెలుపునకు దోహదం చేశాయి.

- సీఎం కేసీఆర్ నిర్వహించిన రెండు సమావేశాలు. ఎన్నికల సంఘం మునుగోడు బైపో‌ల్‌కు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆగస్టు 20వ తేదీన ఒకటి, ఎన్నికకు మూడు రోజుల ముందు అక్టోబర్ 30వ తేదీన నిర్వహించిన సీఎం సమావేశాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం, ఓటర్లలో భరోసా కల్పించాయి. ఈ రెండు సమావేశాలు ఓటర్లను టీఆర్ఎస్‌కు ఓటు వేయించడానికి కన్విన్స్ చేశాయి.

- కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోగానే.. సీఎం, కేటీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. బీజేపీ, కాంగ్రెస్‌లలోని అసంతృప్త క్యాడర్‌ను టీఆర్ఎస్‌లో కలుపుకుని ఆ పార్టీల గ్రౌండ్ లెవల్ సపోర్ట్‌ను టీఆర్ఎస్ కొల్లగొట్టింది.

Also Read: మునుగోడులో ఓడి గెలిచిన బీజేపీ.. పరాజయం పాలైనా ప్లస్సే.. ఎలాగంటే?

- లబ్దిదారులను టీఆర్ఎస్ నేరుగా సంప్రదించింది. టీఆర్ఎస్ 2014 నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ది పొందిన 3,34,994 మందిని కాంటాక్ట్ చేసింది. వీరి మద్దతు కోరుతూ టీఆర్ఎస్ వీరికి లేఖలు రాశారు.

- అధికారిక పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, ఫండ్స్ వస్తాయని టీఆర్ఎస్ గట్టిగా ప్రచారం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడును అభివృద్ధి చేయలేదని చాలా మందిని ఒప్పించగలిగింది.

- టీఆర్ఎస్ గెలిచిన తర్వాత 14 రోజుల్లోనే హామీలు నెరవేర్చడం మొదలు పెడతామని, మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇవ్వడం.

- టీఆర్ఎస్ పెద్దమొత్తంలో నేతలను రంగంలోకి దింపింది. 14 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలను దింపి గ్రామ, బూత్ స్థాయి‌లో నిర్వహణలు చేపట్టారు. ప్రతి 100 మందికి ఒక ఇంచార్జీని ఇక్కడ నియమించారు.

Also Read: అక్కడ నోటాకు రెండో స్థానం.. ఇక్కడ కేఏ పాల్‌కు ఓట్లెన్నో తెలుసా?

- ఇతర రాష్ట్రాలు, హైదరాబాద్‌‌కు వలస వెళ్లిన ఓటర్లను ఉచితంగా మునుగోడుకు రప్పించి టచ్‌లో ఉంచుకుని ఓటేయించుకుంది.

- రూ. 18 వేల కాంట్రాక్టుకు రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. తెలంగాణ, మునుగోడు అమ్ముడుపోవని తరుచూ టీఆర్ఎస్ పేర్కొనడం చేసింది.

- మునుగోడులో మెజార్టీగా బీసీలు, ఎస్టీలు ఉంటారు. బీసీలకు ముఖ్యంగా యాదవులకు నగదు బదిలీ చేస్తామని, ఎస్టీలకు రిజర్వేషన్లు మెరుగుపరుస్తామని టీఆర్ఎస్ హామీలు ఇచ్చింది.

Also Read: మునుగోడులో బీజేపీ ఓటమికి కారణాలివే.. వ్యూహాత్మక తప్పిదాలు.. చౌటుప్పల్, చండూర్‌లో అంచనాలు తలకిందులు!

- అలాగే, ఈ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీలకు మంచి బలం ఉన్నది. సీఎం ఈ వామపక్ష పార్టీలతో వ్యూహాత్మక ఒప్పందం పెట్టుకున్నారు.

click me!