హైద్రాబాద్ నగరంలోని మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతికి ఇన్ ఫెక్షన్ కారణమని వైద్య ఆరోగ్య శాఖ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రభుత్వానికి చేరింది.
హైదరాబాద్:నగరంలోని మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతికి ఇన్ ఫెక్షన్ కారణమని వైద్యశాఖ ఏర్పాటు చేసినఉన్నతాధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను వైద్య శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి అందింది. మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇద్దరు బాలింతలు మృతి చెందారు. ఈ ఇద్దరు మృతి చెందడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలింతల మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 13న ఆసుపత్రి ఎదుట మృతుల కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు.
మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో ఈ ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న 18 మందిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు బాలింతలకు కిడ్నీలకు ఇన్ ఫెక్షన్ సోకింది. వీరికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు. నిమ్స్ లో చికిత్స పొందిన వారిలో 9 మందిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వారు కూడా కోలుకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు.
మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో సిజేరియల్ ఆపరేషన్ చేసిన తర్వాత నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సిరివెన్నెల మృతి చెందింది. రెండో కాన్పు కోసం మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించింది. మరో వైపు శివానీ అనే మహిళ మొదటి కాన్పు కోసం మలక్ పేట ఆసుపత్రిలో చేరింది. సిజేరియన్ ఆపరేషన్ చేసిన తర్వాత శివానీ అస్వస్థతకు గురైంది. వీరిద్దరూ మృతి చెందారు.
also read:మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో బాలింతల మృతిపై ప్రశ్నలున్నాయి: తమిళిసై సంచలనం
2022 ఆగష్టు మాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంటపట్నం ప్రభుత్వాసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్లు చేసుకున్న 34 మందిలో ముగ్గురు మృతి చెందారు. ఈ ముగ్గురి మృతికి కూడా ఇన్ ఫెక్షన్ కారణమని అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ప్రభుత్వం అప్పట్లో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణ విషయమై కమిటీ కొన్ని సూచనలు చేసింది. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు జరగకుండా చూస్తామని అధికారులు ప్రకటించారు. కానీ తాజాగా మలక్ పేట ప్రభుత్వాసుపత్రి మరోసారి ఇలాంటి ఘటన వెలుగు చూసింది.