కత్తి, గొడ్డలితో కిరాతకంగా నరికి... ఆస్తి కోసం కన్నతండ్రిని కడతేర్చిన కసాయి కొడుకులు

By Arun Kumar PFirst Published May 13, 2022, 12:08 PM IST
Highlights

ఆస్తి కోసం కన్నతండ్రినే కత్తి, గొడ్డలితో నరికి అతి కిరాతకంగా చంపారు ఇద్దరు కసాయి తనయులు. ఈ దారుణం సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

సూర్యాపేట: కంటికిరెప్పలా చూసుకుంటూ పెంచి పెద్దచేసిన కన్నతండ్రిని ఆస్తి కోసం అతి కిరాతకంగా హతమార్చాకు కసాయి తనయులు. వ్యవసాయా భూమి అమ్మకం విషయంలో తండ్రీ కొడుకులకు మధ్య వివాదం తల్లెత్తింది. ఈ క్రమంలోనే కన్న తండ్రిపై ప్రేమ లేకపోయినా వృద్దుడని కనీస జాలికూడా చూపకుండా కత్తి, గొడ్డలితో నరికి అతి క్రూరంగా హత్యచేసారు. ఈ అమానుష ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...  సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన యరగాని శ్రీనయ్య(50), అంజమ్మ (45) దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులతో పాటు ఓ కూతురు పెళ్ళి అయిపోయింది. పెద్దకొడుకు రాజశేఖర్ డిసిఎం డ్రైవర్ గా పనిచేస్తుండగా, చిన్నకొడుకు సంతోష్ వ్యవసాయం చేసుకుంటున్నారు. 

అయితే వయసు మీదపడుతుండటం, ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లయి వేరువేరుగా వుండటంతో తన పేరిట వున్న వ్యవసాయ భూమిని శ్రీనయ్య ఇద్దరికీ పంచాడు. 9 ఎకరాల్లో ఏడెకరాలు కొడుకులకు పంచి మిగతా రెండెకరాలు తనవద్దే వుంచుకున్నాడు. అయితే పంటలు సరిగ్గా పండక, పరిస్థితులు అనుకూలించక ఇద్దరు అన్నదమ్ములు అప్పులపాలయ్యారు. దీంతో తండ్రి నుండి సంక్రమించిన భూమిలో చెరో ఎకరం అమ్మేసి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఓ వ్యక్తివద్ద  కొంత డబ్బు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. 

అయితే కొడుకులు భూమి అమ్మడాన్ని శ్రీనయ్య తీవ్రంగా వ్యతిరేకించాడు. పొలం కొనడానికి సిద్దపడ్డ వ్యక్తి ఇంటికి వెళ్లిమరీ అడ్డుకున్నాడు. దీంతో అతడికి కొడుకులతో గొడవ జరిగింది. ఎట్టకేలకు కొడుకులు భూమిని విక్రయించకుండా శ్రీనయ్య అడ్డుకున్నాడు. 

అయితే ఇటీవల తన పేరిట వున్న రెండెకరాల్లో ఎకరంనర భూమిని శ్రీనయ్య కూతురు రాజ్యలక్ష్మికి  రాసిచ్చాడు. ఈ విషయం కొడుకులను తెలియదు. కానీ ఇటీవల ఆమె తండ్రి రాసిచ్చిన భూమిని మరో వ్యక్తిని అమ్మడంతో విషయం బయటపడింది. దీంతో కొడుకులిద్దరు తండ్రిపై కోపంతో రగిలిపోయారు. ఇలాగే వదిలేస్తే తండ్రి మిగతా అరఎకరం కూడా సోదరికే రాసిస్తాడని భావించిన రాజశేఖర్, సంతోష్ తండ్రి హత్యకు సిద్దపడ్డారు. 

తల్లి పొలానికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా వున్న తండ్రిపై ఇద్దరు కొడుకులు కత్తి, గొడ్డలితో దాడిచేసారు. దీంతో తీవ్ర రక్తస్రావమై శ్రీనయ్య అక్కడికక్కడే మరణించాడు. తల్లి అంజ్నారు,మ్మ ఫిర్యాదుతో తండ్రిని చంపిన ఇద్దరు కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఇద్దరు కొడుకుల అరెస్ట్ తో శ్రీనయ్యకు కూతురు రాజ్యలక్ష్మి  అంతిమ సంస్కారాలు నిర్వహించింది. 

click me!