వరంగల్‌ హైవేపై ఢీ కొన్న ఆర్టీసీ బస్సులు, డ్రైవర్ల పరిస్థితి విషమం..

Published : Jan 13, 2021, 12:20 PM IST
వరంగల్‌ హైవేపై ఢీ కొన్న ఆర్టీసీ బస్సులు, డ్రైవర్ల పరిస్థితి విషమం..

సారాంశం

పండగపూట జాతీయ రహదారి మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి.  కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దీంతో భోగీ రోజు ఆనందంగా గడపాల్సిన వారంతా ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. 

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద ఉన్న ఈ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 24మందికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కాగా.. ఈ ఘటనలో రెండు ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 
PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ ప్లాట్ ధరకే ఇండిపెండెంట్ ఇళ్లు... ఎక్కడో తెలుసా?
IMD Rain Alert : ఉపరితల ఆవర్తనంతోనే జోరువానలు, ఇప్పుడు ద్రోణి కూడా.. ఈ ప్రాంతాల్లో పెను బీభత్సమే