హైద్రాబాద్‌ కూకట్‌పల్లిలో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం

Published : Jan 13, 2021, 12:15 PM ISTUpdated : Jan 13, 2021, 12:25 PM IST
హైద్రాబాద్‌ కూకట్‌పల్లిలో భూకంపం:  భయంతో పరుగులు తీసిన జనం

సారాంశం

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో బుధవారం నాడు ఉదయం భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.  

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో బుధవారం నాడు ఉదయం భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.పెధ్దశబ్దంతో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. భూమి నుండి శబ్దాలు వచ్చి కంపించడంతో  స్థానికులు భయంతో పరుగులు తీశారు.

 

గతంలో కూడ  హైద్రాబాద్ బోరబండ ప్రాంతంలో భూమి కంపించిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. గత ఏడాదిలో బోరబండలో వరుసగా భూమి  కంపించడంతో స్థానికులు భయపడ్డారు. వరుసగా  నాలుగైదు రోజులు భూ కంపం సంభవించడంతో  స్థానికులు భయంతో గడిపిన విషయం తెలిసిందే.

తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు ప్రాంతంలో తరచుగా భూకంపం వాటిల్లుతోంది. మేళ్లచెరువుకు సమీపంలోని ఏపీ రాష్ట్రంలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూడ గతంలో భూమి కంపించినట్టుగా భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు.

హైద్రాబాద్ ప్రాంతంలో భూ కంపాలనకు గల కారణాలపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!