ఎమ్మెల్యేకి కేసీఆర్ బంపర్ ఆఫర్

Published : Apr 02, 2019, 10:06 AM IST
ఎమ్మెల్యేకి కేసీఆర్ బంపర్ ఆఫర్

సారాంశం

తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. కొందరు అధికార టీఆర్ఎస్ లోకి జంప్ చేయగా.. ఇంకొందరు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. 

తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. కొందరు అధికార టీఆర్ఎస్ లోకి జంప్ చేయగా.. ఇంకొందరు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. కాగా.. ప్రస్తుతం టీడీపీ నుంచి తెలంగాణలో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొంచారు. గత కొంతకాలంగా ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నారనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఇప్పటి వరకు అయితే మారలేదు.

అయితే.. తాజాగా మెచ్చా నాగేశ్వరరావుకి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరితే గిరిజన మంత్రి ఇస్తానని కేసీఆర్‌ చెప్పారని మెచ్చా చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‌లో చేరడం ఇష్టలేదని.. టీడీపీలో కొనసాగడమే ఇష్టమన్నారు. డబ్బులు, పదవులకు లొంగే వ్యక్తిని కానని మెచ్చా మీడియాకు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!