వేర్వేరు చోట్ల ఇద్దరు అనాథ విద్యార్థినులపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి...

By SumaBala Bukka  |  First Published Jun 7, 2022, 10:05 AM IST

హైదరాబాద్ లో అమ్మాయిలపై అత్యాచారాల ఘటనలు రోజుకోటి చోటు చేసుకుంటన్నాయి. వీటిల్లో కొన్ని ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం ఓ ఇద్దరు అనాథ విద్యార్థినుల మీద అత్యాచారం జరిగిన ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 


హైదరాబాద్ : హైదరాబాదులోని ఓ Orphanageలో ఉన్న ఇద్దరు ఇంటర్ విద్యార్థినులను కామాంధులు కాటేసిన ఉదంతాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు వేర్వేరు ఘటనలూ ఏప్రిల్ లో జరిగాయి. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాధిత బాలికలిద్దరూ భయంతో ఇటీవలి వరకు నోరు విప్పలేదు. జూన్ 3న వసతి గృహం అధికారులకు చెప్పగా వారు పోలీసులకు అదే రోజు రాత్రి ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసుకున్న హుమాయున్ నగర్ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతాల ఆధారంగా ఒక molestation కేసును రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ కు, మరో దాన్ని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు జీరో ఎఫ్ఐఆర్ గా శనివారం బదిలీ చేశారు. రామ్ గోపాల్ పేట పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. మరో కేసులో మైనర్ అయిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితులు ఇద్దరు మైనర్ లే.

Latest Videos

undefined

పుట్టినరోజు వేడుకకు తీసుకువెళ్లి…
అనాధ బాలికల వసతి గృహంలో ఉన్న విద్యార్థినికి ఆమె స్నేహితుడొకరు ఏప్రిల్ 20న తన పుట్టినరోజు వేడుకను నెక్లెస్ రోడ్లో చేసుకుందామని చెప్పాడు. బాధితురాలితోపాటు మరో ఇద్దరు విద్యార్థినులు, ఆ స్నేహితుడు, బాధితురాలికి పరిచయస్థుడైన సురేష్(23) అనే యువకుడు కారులో నెక్లెస్ రోడ్ లోకి వెళ్లారు. అదే రోజు అర్ధరాత్రి బాధితురాలి స్నేహితుడి పుట్టినరోజు జరుపుకున్నారు. మిగతావాళ్లు కబుర్లు చెప్పుకుంటుండగా..  కార్లో మాట్లాడుకుందామని అమ్మాయిని సురేష్ తీసుకువెళ్ళాడు. కారులో కూర్చోగానే ఆమెపై సురేష్  అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్దిరోజుల నుంచి ఆమె ప్రవర్తనలో తేడా రావడం సంక్షేమ శాఖ అధికారి శుక్రవారం రాత్రి ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది.

మల్టీప్లెక్స్ లో సినిమా చూపిస్తానంటూ..
మరో విద్యార్థినికి కళాశాలలో ఇద్దరు విద్యార్థులు స్నేహితులయ్యారు వీరు ముగ్గురు తరచు మాట్లాడుకునేవారు. ఏప్రిల్ 25న ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. సినిమాకి వెళ్దాం అంటూ ఓ స్నేహితుడు ప్రతిపాదించాడు. అదే రోజు రాత్రి ముగ్గురూ కారులో అత్తాపూర్ లోని మల్టిప్లెక్స్ కి వెళ్లారు. కూల్ డ్రిక్ తాగుదామని చెప్పి ఆమెకు స్నేహితులు బయటికి తీసుకువచ్చాడు. మాల్ లో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి తోటి విద్యార్థిని ప్రశ్నించినప్పుడు తన పైనా అత్యాచారం జరిగిందని ఈమె చెప్పడంతో విషయం బయటపడింది. 

కాగా, సికింద్రాబాద్ పరిధిలో మైనర్ పై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్ఖానా పరిధిలో బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల్లో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. బాలికతో ఇన్ స్టాగ్రాంలో పరిచయం పెంచుకున్న నిందితులు ధీరజ్, రితేశ్ బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నారు.

అత్యాచారం చేసిన సమయంలో వీడియోలు తీసి ధీరజ్, రితేష్ బాలికను భయపెట్టారు. వీడియోలు ఇస్తానని చెప్పి పిలిచి.. ఇతర స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దాదాపు రెండు నెలల క్రితం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక పరిస్థితి చూసి ఆమె కుటుంబ సభ్యులు మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకువెళ్ళారు.  మానసిక నిపుణుడు వద్ద బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు మే 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

click me!