తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటు.. ఏ జిల్లాల్లో అంటే ?

Published : Apr 19, 2023, 02:05 PM IST
తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటు.. ఏ జిల్లాల్లో అంటే ?

సారాంశం

తెలంగాణలో మరో రెండు కొత్త మాండలాలు ఏర్పాటు అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 10 గ్రామాలతో పల్వంచ, జోగులాంబ గద్వాలో జిల్లాలో తొమ్మిది గ్రామాలతో ఎర్రవల్లి అనే మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో ఉన్న మాచారెడ్డి మండలంలోని 9 గ్రామాలను, అలాగే రామారెడ్డి మండలంలోని ఒక గ్రామాన్ని తీసుకొని కొత్తగా ‘పల్వంచ’ మండలంగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కామారెడ్డి జిల్లాలో మండలాల సంఖ్య 24కు చేరింది. 

అతిక్, అష్రఫ్ హత్య కేసు.. ముగ్గురు షూటర్లకు 4 రోజుల కస్టడీ విధించిన ప్రయాగ్ రాజ్ కోర్టు

దీంతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఇటిక్యాల మండలంలో నుంచి తొమ్మిది గ్రామాలను వేరు చేస్తూ కొత్తగా ‘ఎర్రవల్లి’ అనే మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇటు కామారెడ్డి జిల్లాలో, అటు జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొత్త మండలాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు