నారాయణపేట జిల్లాలో తొలి కరోనా కేసు: రెండు నెలల చిన్నారికి పాజిటివ్

By telugu team  |  First Published Apr 18, 2020, 3:43 PM IST

తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. రెండు నెలల వయస్సు గల చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు నీలోఫర్ వైద్యులు నిర్ధారించారు. 


హైదరాబాద్: తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. రెండు నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు నీలోఫర్ వైద్యులు నిర్ధారించారు. దీంతో చిన్నారి కుటుంబానికి చెందిన ఆరుగురిని క్వారంటైన్ కు పంపించారు. 

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర రాజధాని ముషీరాబాద్ ప్రాంతంలో ఓ మిల్క్ బాత్ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పరీక్షల్లో అతని సోదరికి కూడా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అంతేకాకుండా వాళ్లు నివాసం ఉంటున్న ఆపార్టుమెంట్ వాచ్ మన్ ఐదేళెల కుమారుడికి కూడా పాజిటివ్ వచ్చింది.

Latest Videos

undefined

దాంతో మిల్క్ బూత్ వ్యక్తికి చెందిన 16 మందిని క్వారంటైన్ కు తరలిం్చారు. దానికితోడు, ఆపార్టుమెంటులో నివాసం ఉంటున్న 40 మందిని క్వారంటైన్ కు తరలించారు. అతని వద్ద పాలు కొనుగోలు చేసిన వ్యక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. 

కాగా, హైదరాబాదులోని నేరేడుమెట్ మధురానగర్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతని కుటుంబం మొత్తాన్ని అధికారులు క్వారంటైన్ కు తరలించారు. ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం అన్నదానం చేయడమే కాకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేశాడు. దాంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు 50 మంది ఇందులో పాల్గొన్నారు.

ఇదిలావుంటే, తెలంగాణలో ఇప్పటి వరకు 766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 18 మంది కోవిడ్ -19 వ్యాధితో మరణించారు. హైదరాబాదులో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. 

click me!