పశువులను కాపాడబోయి ఇద్దరు దుర్మరణం.. గడ్డివాముకు నిప్పంటుకోవడంతో దారుణం...

By SumaBala Bukka  |  First Published May 21, 2022, 12:54 PM IST

గడ్డివాముకు నిప్పంటుకోవడంతో పశువులను కాపాడడానికి పోయి.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. 


ఎల్లారెడ్డిపేట : పశువులను కాపాడబోయి వదిన, మరిది current shockతో ప్రాణాలు కోల్పోయారు. Rajanna Sircilla జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి తండాలో బానోతు నీల (37),  బానోతు రవి (34) ఇంటికి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు వెలువడి గడ్డివాముకు నిప్పంటుకుంది. దీంతో సమీపంలోని పాకలో ఉన్న పశువులను మంటల నుంచి కాపాడేందుకు నీల, రవి వెళ్లారు.

 అదే సమయంలో మంటలకు విద్యుత్ తీగలు తెగి వారిపై పడ్డాయి. తీగలు కాళ్లకు చుట్టుకోవడంతో కరెంట్ షాక్కు గురై ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు, బంధువులు శుక్రవారం ఉదయం మృతదేహాలతో వీర్నపల్లి సబ్ స్టేషన్ ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని మూడు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అక్కడికి చేరుకుని కలెక్టర్, సెస్ ఎండీలతో  మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. 

Latest Videos

undefined

ఇదిలా ఉండగా, ఈ నెల మూడో తేదీన ఇలాంటి ఘటనే అరకులో జరిగింది. Alluri Sitaramaraj District అరకులోయలో విషాదం చోటు చేసుకుంది. Service wire మీద దుస్తులు ఆరేస్తుండగా దంపతులు మృతి చెందారు. భర్తను కాపాడే ప్రయత్నంలో భార్యకు Electric shock కొట్టింది. అరకులోయలోని విద్యుత్ ఉద్యోగుల క్వార్టర్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో దంపతులు స్పృహ కోల్పోయారు. పరిస్థితిని గమనించిన స్తానికులు 108కు కాల్ చేశారు. అంబులెన్స్ రాక ఆలస్యం కావడంతో భార్యాభర్తలు మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 

కాగా, ఈ జనవరిలో బల్లార్షలో కరెంట్ షాక్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. కలకాలం కలిసి ఉంటానని మాట ఇచ్చిన భర్తే.. Current shock ఇచ్చి,, ఆపై axeతో నరికి అర్ధాంగిని కర్కశంగా కడతేర్చాడు. ఈ పైశాచిక ఘటన మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా గోండ్ పిప్రీ తాలూకా బంగారం తడోదిలో జరిగింది. గడ్చిరోలి ఠాణా ఇన్స్పెక్టర్ జీవన్ రాజగురు తెలిపిన వివరాల మేరకు…  బంగారం తడోది గ్రామానికి చెందిన రాజు భావనే (43), యోగిత (35) దంపతులు.  వీరికి ఒక కుమారుడు ఓంకార్ (14).శనివారం భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న Dispute చినికి చినికి గాలివాన అయ్యింది. ఈ నేపథ్యంలో భార్యను అంతమొందించాలని రాజు పన్నాగం పన్నాడు. ఈ మేరకు ఆదివారం వేకువజామున నిద్రిస్తున్న ఆమెను లేపి.. హాలులోకి తీసుకువచ్చి.. నిర్బంధించాడు. ఆ తరువాత విద్యుత్ తీగల సహాయంతో కరెంట్ షాక్ ఇచ్చాడు.

అయినా భార్య ప్రాణం పోకపోవడంతో.. పక్కనే ఉన్న గొడ్డలితో అత్యంత పాశవికంగా ఆమె మెడపైన.. తల పైన నరికి హతమార్చాడు.  ఆ తరువాత వెంటనే పురుగుల మందు తాగి తానూ Suicide కు ప్రయత్నించాడు. అయితే.. ఈ క్రమంలో తల్లి వేసిన కేకలకు పక్కగదిలో నిద్రిస్తున్న కుమారుడు మేలుకున్నాడు.అతడు గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చారు. దంపతులిద్దరిని గోండ్ పిప్రీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే భార్య యోగిత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త రాజుకు చికిత్స అందిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. 

click me!