తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. తాగుబోతు కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.
హైదరాబాద్: ఓ తాగుబోతు కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఆదివారం అర్దరాత్రి హైదరాబాద్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారు ఢీకొనడంతో స్పాట్ లోనే ఇద్దరు మృత్యువాతపడ్డారు.
వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని hyderabad మహానగరంలో వాహనాలు బీభత్సం సృష్టించి అమాయకుల ప్రాణాలను బలిగొన్న దుర్ఘటనలు అనేకం. ఇలాంటి ఘటనే ఆదివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో జరిగింది.
undefined
ఓ వ్యక్తి మద్యంమత్తులో మితిమీరిన వేగంతో కారు నడుపుతూ రోడ్డుపై వెళుతున్న ఇద్దరిని ఢీకొట్టాడు. కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తును అమాంతం గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఇంత జరిగితే కారు డ్రైవర్ మాత్రం ఆగకుండానే అక్కడినుండి పరారయ్యాడు.
read more జగిత్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం... ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి
ఈ యాక్సిడెంట్ ను గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదస్థలికి దగ్గర్లోని సిసి కెమెరాల ఆదారంగా కారును గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి వుంది.
ఇదిలావుంటే కరీంనగర్ జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ఆటో రోడ్డు ప్రమాదానికి గురయి 15మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కూడా నలుగురి పరిస్థితి విషమంగా వుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకుచెందిన కొందరు ఓ ఆటోలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. ఉదయమే ఆలయానికి చేరుకుని దర్శనాది కార్యాక్రమాలన్ని ముగించుకుని సాయంత్రం స్వస్థలానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే వీరు ప్రమాదానికి గురయ్యారు.
read more ఔటర్ పై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. మంటల్లో దగ్థం...
వీరు ప్రయాణిస్తున్న ఆటోను karimnagar district మనకొండూరు మండలం చెంజర్ల వద్ద లారీ ఢీ కొట్టింది. అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటో తుక్కుతుక్కయ్యింది. అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదసమయంలో ఆటోలో వున్న 15 మంది తీవ్రంగా గాయపడగా వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా వుంది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆటోలో చిక్కుకున్నవారిని కాపాడారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న వారు క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.