చెత్త ఏరుకునే వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో దారుణం..

By SumaBala Bukka  |  First Published Dec 6, 2021, 9:35 AM IST

చెత్త ఏరుకునే వ్యక్తి ఓ వివాహిత అక్రమసంబంధం పెట్టకుంది. దీనిమీద ఎవరికీ ఎలాంటి అనుమాలుండవనుకుంది. ప్రతిరోజూ భర్త బయటికి వెళ్లగానే... చెత్త ఏరుకునే నెపంతో ఇతడు అటుగా వెళ్లి ఇంట్లోకి దూరేవాడు. అయితే తప్పు ఎప్పటికైనా బయటపడుతుందన్నట్టు చివరికి వాళ్ల విషయం భర్తకు తెలిసింది. దీంతో దారుణం జరిగిపోయింది... 


రంగారెడ్డి : భర్తకి ఊళ్లో కొద్దో గొప్పో గుర్తింపు ఉంది.. కాలనీలో అందరికీ పరిచయస్తుడు కావడంతో వచ్చే, పోయే దారిలో పలకరింపులు కామన్.. క్రమం తప్పకుండా పనికి వెళ్లేవాడు. కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. wifeకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఇంటికే తెచ్చిపెట్టేవాడు. అయితే, ఏం ఆలోచించిందో ఏమోగానీ ఆ ఇల్లాలు తనకున్నదానితో సంతృప్తి పడలేదు. 

భర్తతో సంసారం సజావుగా సాగుతున్నట్లు కనిపించినా, అదుపుతప్పిన Physical desires ఆమెను దారి తప్పేలా చేశాయి. వీధిలో ఉన్నవాళ్లంతా భర్తకు పరిచయస్తులే కావడంతో ఎవరికి దగ్గరకాలేక చివరికి చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం క్రమంగా Illegal affairకి దారి తీసింది. 

Latest Videos

waste picker వ్యక్తే కాబట్టి ఎవరికీ ఎలాంటి అనుమానాలుండవని ఆమె భావించింది. ప్రతిరోజూ భర్త బయటికి వెళ్లగానే.. చెత్త ఏరుకునే నెపంతో ఇతడు అటుగా వెళ్లి ఇంట్లోకి దూరేవాడు. అయితే, తప్పు ఎప్పటికైనా బయటపడుతుందన్నట్లు, చివరికి వాళ్ల విషయం భర్తకు తెలిసింది. పద్ధతి మానుకోవాల్సిందిగా నచ్చచెప్పాడు. వినలేదు. ఆ తరువాత సీన్ మొత్తం రివర్స్ అయి రక్తపాతానికి దారి తీసింది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకు వివరాలివి...

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో రెండు రోజుల కిందట ఓ హత్యోదంతం కలకలం రేపింది. ఓ పాడుబడ్డ ఇంట్లో వ్యక్తి Brutal murderకు గురి కావడాన్ని చూసి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఎంటరయ్యారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత చనిపోయిన వ్యక్తిని నాగరాజుగా గుర్తించారు. 

జాకెట్ కోసం భర్తతో గొడవపడి.. మహిళ ఆత్మహత్య...

ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన అతను ఒంటరిగానే షాద్ గనర్ లో నివసిస్తూ రోడ్లు పక్కన చెత్త, చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం కొనసాగించేవాడు. గురువారం రాత్రి నాగరాజు హత్య జరగ్గా, శనివారం రాత్రి నాటికి ఈ కేసులో అనూహ్య కోణాలు వెలుగులోకి వచ్చాయి. 

స్థానిక పటేల్ రోడ్డులోనే నివసించే ఓ వివాహితతో నాగరాజు వివాహేతర బంధం కొనసాగిస్తున్నట్లు వెల్లడయ్యింది. భర్తతో కలిసి ఉంటున్న సదరు మహిళ.. అతను పనిమీద బయటికి వెళ్లగానే ప్రియుడిని ఇంటికి పిలిపించుకునేదని, గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారం ఆ నోటా, ఈ నోటా భర్తకు తెలియడంతో ఆ భర్త.. భార్య ప్రియుణ్ని అంతం చేయాలనుకున్నాడు.

పటేల్ నగర్ లోనే ఓ పాడుబడ్డ ఇంట్లో ఉంటున్న నాగరాజు దగ్గరికి గురువారం రాత్రి మహిళ భర్త వెళ్లి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నాగరాజు చనిపోయాడు. ఆ తరువాత శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు.. హత్య మీద దర్యాప్తు చేయగా మహిళతో వివాహేతర సంబంధం, భర్తే చంపడం తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని షాద్ నగర్ పోలీసులు చెబుతున్నారు.

click me!