నల్గొండలో ఘోర రోడ్డుప్రమాదం... బస్సు ఢీకొని ఇద్దరు వలస కూలీలు దుర్మరణం

Published : Aug 21, 2023, 12:41 PM IST
నల్గొండలో ఘోర రోడ్డుప్రమాదం... బస్సు ఢీకొని ఇద్దరు వలస కూలీలు దుర్మరణం

సారాంశం

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బస్సును ఢీకొట్టడంతో ఇతర రాష్ట్రానికి చెందిన ఇద్దరు వలసకూలీలు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

నల్గొండ : ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారి దారిలో వారు వెళుతుండగా అదుపుతప్పిన బస్సు మృత్యువు రూపంలో దూసుకువచ్చింది. ఇలా ఇద్దరు వలస కూలీలను బస్సు బలితీసుకుంది. 

పోలీసుల తెలపిన వివరాలాలా ఉన్నాయి. సోమవారం ఉదయం మిర్యాలగూడ నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మార్గమద్యలో బీభత్సం సృష్టించింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం సమీపంలో వేగంగా వెళుతున్న బస్సు టైర్ ఒక్కసారిగా పగిలింది. దీంతో డ్రైవర్ కు బస్సును అదుపుచేయడం సాధ్యంకాలేదు. అదే వేగంతో ముందుకు దూసుకెళ్ళిన బస్సు అదుతప్పిన ఎదురుగా వచ్చిన బైక్ ను ఢీ కొట్టింది. 

బైక్ వెళుతున్న ముగ్గురు చత్తీస్ ఘడ్ వలసకూలీల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడి మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం. 

Read More  బ్యాంకులో పని ఒత్తిడి తట్టుకోలేక మేనేజర్ సూసైడ్.. ఆఫీసులోనే అఘాయిత్యం.. ఆసిఫాబాద్ లో ఘటన

టైర్ పగిలి బైక్ ను ఢీకొని కూడా బస్సు ఆగలేదు. రోడ్డుపక్కన పొలంలోకి దూసుకెళ్ళి  బురదలో చిక్కుకుపోవడంతో ఆగింది. ఈ ప్రమాదం నుండి బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రోడ్డుపై పడివున్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే