హైద్రాబాద్ లో మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్, బ్రీత్ ఎనలైజర్ టెస్టులో 200 పాయింట్లు

Published : Mar 29, 2022, 11:56 AM IST
హైద్రాబాద్ లో మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్, బ్రీత్ ఎనలైజర్ టెస్టులో 200 పాయింట్లు

సారాంశం

హైద్రాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద మద్యం మత్తులో కారును డ్రైవ్ చేయడంతో ఇద్దరు గాయపడ్డారు.ఆటో, బైక్ లను ఢీకొడుతూ కారు దూసుకెళ్లింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  

హైదరాబాద్:  Jubilee hills వద్ద మద్యం మత్తులో ఓ యువకుడు Car డ్రైవ్ చేశాడు. అతి వేగంగా కారు నడపడుతూ ఆటో, రెండు బైక్‌లను మంగళవారం నాడు ఉదయం ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. మద్యం మత్తులో  నిందితుడు కారును ర్యాష్ గా డ్రైవ్ చేశారని పోలీసులు గుర్తించారు.

కారును నడిపిన వ్యక్తికి పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు షాకయ్యారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో 200 పాయింట్లు చూపింది. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. 

Hyderabad నగరంలో మద్యం మత్తులో ఇటీవల కాలంలో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమౌతున్న ఘటనలు కూడా లేకపోలేదు. హోళీపండుగ రోజున అంతకు ముందు రోజున  హైద్రాబాద్ నగరంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు నగర వాసుల్ని భయబ్రాంతులకు గురి చేశాయి.

ఈ నెల 17వ తేదీన రాత్రి జూబ్లీహిల్స్ వద్ద కారు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో రెండు మాసాల చిన్నారి మరణించింది. మరో ముగ్గురు గాయపడ్డారు. బోధన్ ఎమ్మెల్యే కజిన్ మీర్జాతో పాటు ఆయన కొడుకును ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకు రాహిల్ కూడా ఉన్నారని పోలీసులు గుర్తించారు. 

ఈ నెల 18న గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.  జూనియర్‌ ఆర్టిస్ట్‌ గాయత్రి తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి ప్రిసమ్‌ పబ్‌ నుండి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదానికి కారణామని తమ ప్రాథమిక విచారణలో తెలిసినట్లు పేర్కొన్నారు.

అతివేగంగా వచ్చిన వీరి కారు ఎల్లా హోటల్‌ ముందు ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టి గాల్లోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఆ దగ్గర్లోనే గార్డెనింగ్‌ పనులు చేస్తున్న మహేశ్వరి(38)ని ఢీకొట్టడంతో ఆమె  అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రోహిత్, జూనియర్‌ ఆర్టిస్ట్‌, యూట్యూబర్‌ గాయత్రిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ నెల 21న ట్యాంక్ బండ్ పై విధులు నిర్వహిస్తున్న ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్ ను కారు ఢీకొట్టింది. వాహనాలు తనిఖీ చేస్తున్న జహంగీర్ ను వెనుక నుండి  వస్తున్న కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో జహంగీర్ తీవ్రంగా గాయపడ్డారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu