హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం.. శిశువులను ఇంక్యుబేటర్‌లోనే వదిలేసిన వైనం.. వేడి తట్టుకోలేక ఇద్దరు మృతి

Published : May 10, 2022, 08:11 PM IST
హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం.. శిశువులను ఇంక్యుబేటర్‌లోనే వదిలేసిన వైనం.. వేడి తట్టుకోలేక ఇద్దరు మృతి

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పాతబస్తీ ఫలక్‌నూమాలో ఓ ప్రైవేటు హాస్పిటల్ లో దారుణం జరిగింది. హాస్పిటల్ సిబ్బంది ఇద్దరు చిన్నారులను వేడిమి కోసం ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఆ తర్వాత మరిచిపోయారు. దీంతో ఆ వేడి తట్టుకోలేక ఇద్దరు చిన్నారులు ఇంక్యుబేటర్‌లోనే మరణించారు.

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో సిబ్బంది నిర్లక్ష్యం ఇద్దరు శిశువుల ప్రాణాలు తీసింది. చిన్నారులను ఇంక్యుబేటర్‌లో ఉంచి ఆ తర్వాత వెనక్కి తీసుకోలేదు. దీంతో ఆ ఇంక్యుబేటర్‌లోనే ఇద్దరు శిశువులు మృతి చెందారు. పాతబస్తీ ఫలక్‌నూమాలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీనిపై శిశువుల కుటుంబాలు హాస్పిటల్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పాతబస్తీ ఫలక్‌నూమాలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సాధారణంగా పిల్లలు పుట్టిన కొంత కాలానికి వారి ఆరోగ్య వివరాల దృష్ట్యా వేడి కోసం ఇంక్యుబేటర్‌లో ఉంచాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇవే సూచనలతో ఫలక్‌నూమాలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అప్పుడే పుట్టిన ఇద్దరు పిల్లలను ఇంక్యుబేటర్‌లో ఉంచారు. అయితే, ఇద్దరు చిన్నారులను ఇంక్యుబేటర్‌లో ఉంచినట్టు సిబ్బంది మరచిపోయారు. వారిని ఇంక్యుబేటర్‌లోనే వదిలేశారు. దీంతో ఆ ఇంక్యుబేటర్ వేడిమిని శిశువులు తట్టుకోలేకపోయారు. కొంత కాలం తర్వాత ఆ వేడికి శ్వాస వదిలినట్టు తెలుస్తున్నది. ఈ ఘటన ఆ ఏరియాలో కలకలం రేపింది. 

తల్లిదండ్రులు తమ పిల్లలను చేతుల్లో తీసుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. పిల్లల ముక్కు, బుగ్గలు, పొట్ట భాగాల్లో వేడిమి తాలుకూ గుర్తులను మీడియాకు చూపించారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు