ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలోకి డెడ్ బాడీని తీసుకోవడానికి వెయ్యి రూపాయాలు లంచం డిమాండ్ చేస్తున్నాడు. ఈ డబ్బులను ఇవ్వని కారణంగా మజీద్ కుటుంబ సభ్యులను మార్చురీ సిబ్బంది బూతులు తిట్టాడు.
హైదరాబాద్: మృతదేహాన్ని మార్చురీలోకి తీసుకెళ్లడానికి కూడా ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వెయ్యి రూపాయాలు ఇస్తేనే మృతదేహం తీసుకుంటామని తేల్చి చెప్పాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట పాటు మార్చురీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.ఈ దృశ్యాలను తెలుగు న్యూస్ ఎన్టీవీ ప్రసారం చేసింది.
హైద్రాబాద్ చాదర్‌ఘాట్ కు చెందిన Majid అనే వ్యక్తి ఆర్ధిక ఇబ్బందులతో Suicide కు పాల్పడ్డాడు. మజీద్ మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం చేసే Doctors వచ్చే వరకు డెడ్ బాడీని Mortuaryలో భద్రపర్చేందుకు గాను ఉస్మానియా మార్చురీ సిబ్బందిని కుటుంబ సభ్యులు అడిగారు. అయితే రూ. 1000 ఇస్తేనే డెడ్ బాడీని మార్చురీలో భద్రపరుస్తామని అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చెప్పారు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి మజీద్ కుటుంబ సభ్యులను డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. డబ్బుల కోసం వారిని బూతులు తిట్టారు. మజీద్ కుటుంబ సభ్యులకు ఉస్మానియా మార్చురీ సిబ్బంది మధ్య జరిగిన వాగ్వాదం దృశ్యాలను తెలుగు న్యూస్ చానెల్ ప్రసారం చేసింది.
undefined
మరో వైపు మార్చురీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై మజీద్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ వద్ద డబ్బులు డిమాండ్ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉస్మానియా ఆసుపత్రి వద్ద మజీద్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
లంచం డిమాండ్ చేసిన రాజు అరెస్ట్
ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద లంచం డిమాండ్ చేసిన రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీసులకు అందిన పిర్యాదు మేరకు రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగిగా రాజు పనిచేస్తున్నాడు. ఉస్మానియా ఆసుపత్రిలో మజీదు కుటుంబ సభ్యుల నుండి డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహరంపై పోలీసులు రాజును ఆరా తీయనున్నారు. అయితే తాను మాత్రం డబ్బులు డిమాండ్ చేయలేదని రాజు మీడియాకు చెప్పాడు. మజీదు కుటుంబ సభ్యులు తనపై దాడికి ప్రయత్నించారని రాజు ఆరోపిస్తున్నాడు.
ఇదే విషయమై విచారణ చేసేందుకు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు ఆర్ఎంఓలతో కమిటీని ఏర్పాటు చేశారు.మరో వైపు ఈ విషయమై రాజును ఉస్మానియా సూపరింటెండ్ విచారించారు. రాజును విధుల నుండి తొలగిస్తున్నట్టు కూడా సూపరింటెండ్ ప్రకటించారు.