ఇద్దరు మిత్రుల కథ: కేటీఆర్ పీఏలమని చెప్పి మోసాలు, అరెస్ట్

By Siva KodatiFirst Published Dec 11, 2019, 5:51 PM IST
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేరును ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేరును ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మల్కాజ్‌గిరికి చెందిన కార్తీకేయ, ఫెడ్రిక్ అనే ఇద్దరు యువకులు స్నేహితులు.

Also Read:దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్: రిటైర్డ్ జడ్జితో విచారణకు సుప్రీంకోర్టు మెుగ్గు

వీరు గత కొంతకాలంగా కేటీఆర్ పీఏ అని పేరు చెప్పి ప్రభుత్వ సిబ్బందిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీరాములు అనే వ్యక్తి వీరిని సంప్రదించి, తన కొడుకు వైద్యానికి సాయం చేయాలని కోరాడు.

Also Read:దిశకు పేరేంట్స్‌తో సఖ్యత లేదు.. అందుకే చెల్లికి ఫోన్: కామారెడ్డి జడ్పీ‌ ఛైర్‌పర్సన్ వ్యాఖ్యలు

దీంతో వారు ఫేక్ పత్రాలిచ్చి వైద్యం చేయించుకోవాలన్నారు. శ్రీరాములు వీటిని హాస్పిటల్‌‌లో ఇవ్వగా అవి నకిలీవని తేలింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించగా.. ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.

కార్తీకేయ వృత్తిరీత్యా ఛార్టెట్ అకౌంటెంట్‌.. ప్రభుత్వానికి సంబంధించిన చిన్న చిన్న కాంట్రాక్టులను ఇద్దరు కలిసి చేసేవారు. ఈ క్రమంలో వారికి రాష్ట్ర సచివాలయంలోని చాలా మంది అధికారులు, సిబ్బందితో పరిచయం ఏర్పడింది. లాలాపేటకు చెందిన ఫెడ్రిక్‌ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. 
 

click me!