సంగారెడ్డి జిల్లాలో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

Published : Aug 04, 2022, 10:07 AM ISTUpdated : Aug 04, 2022, 10:43 AM IST
సంగారెడ్డి జిల్లాలో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

సారాంశం

సంగారెడ్డి జిల్లా భానూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 

హైదరాబాద్: Sanga Reddy జిల్లా పటాన్ చెరుకు సమీపంలో Bhanuru లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు Suicideకు పాల్పడ్డారు. మృతులు Madhya Pradesh రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ కు చెందిన  Rekha,  ఆమె రెండేళ్ల కూతురు, రేఖ మరిది బాసుదేవ్ కుప్టా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ముగ్గురు ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ కుటుంబం ఉపాధి కోసం సంగారెడ్డి జిల్లాకు వలసవచ్చింది. కొంత కాలంగా ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆత్మహత్య కేసులు చోటు చేసుకొంటున్నాయి.  చిన్న కారణాలతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు నమోదౌతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని కెంచెగౌడనకొప్పలో వివాహిత తన కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన ఈ నెల 3న చోటు చేసుకొంది. వివాహిత ప్రేమ వివాహం చేసుకుంది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొంది. అయితే పెళ్లైన తర్వాత భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోనే  బెంగుళూరులో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారి తీసింది. చికెన్ కబాబ్ బాగా లేదని భార్యను చితకబాదాడు భర్త, అంతేకాదు కత్తితో ఆమెపై దాడికి దిగాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇరుగు పొరుగు వారిని చూసిన భర్త సురేష్ ఇంటి నుండి పారిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే తరహా ఘటన ఇదే రాష్ట్రంలో చోటు చేసుకొంది. కూతురు పుట్టిన రోజు సందర్భంగా చికెన్ వండలేదని భార్యను కొడవలితో  హత్య చేశాడు భర్త..

 నల్గొండ జిల్లాకు చెందిన నాగలక్ష్మికి  అదే జిల్లా దేవరకొండ కు చెందిన శ్రీకాంత్ తో ఏడేళ్లక్రితం వివాహమయ్యింది. తల్లిదండ్రులకు ఒకే కూతురు కావడంతో భారీగా కట్నకానుకలిచ్చి ఘనంగా పెళ్లిచేశారు. భార్యను వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్