హైద్రాబాద్‌ నిజాంపేటలో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం, ఇద్దరు మృతి

Published : May 12, 2022, 12:52 PM ISTUpdated : May 12, 2022, 01:32 PM IST
హైద్రాబాద్‌ నిజాంపేటలో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం, ఇద్దరు మృతి

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని నిజాంపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు మరణించారు. లలిత, కార్తికేయలు మరణించగా, దివ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.  

హైదరాబాద్:  Hyderabad నగరంలోని Nizampetలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బుధవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు మరణించారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 నిజాంపేటలో నివాసం ఉంటున్న Lalitaha, Shiva Karthikeya, దివ్యలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. లలిత, కార్తికేయలు మరణించారు. Divya ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకొంటున్న ఘటనలు ఎక్కువగా నమోదౌతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు  మండలం యలమంచిలిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ  నెల 5న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.  జిల్లాలోని జలుమూరు మండలం యలమంచిలిలో చింతు చిన్నమ్మ , ఆమె చిన్న కుమార్తె జాహ్నావి, పెద్ద కుమార్తె రంజని, కొడుకు వెంకటసాయి శశాంకర్ లు పెట్రోల్ పోసుకొని ఆత్మహాత్యాయత్నానికి ప్రయత్నించారు.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు నలుగురిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చింత చిన్నమ్మ, ఆమె చిన్న కూతురు జాహ్నావిలు మరణించారు. ఘటన స్థలాన్ని నరసన్నపేట సీఐ ఎం. తిరుపతి, జలుమూరు ఎస్ఐ పారినాయుడు పరిశీలించారు.చిన్నమ్మను భర్త నరసింహులును పోలీసులు విచారిస్తున్నారు.ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు