హైద్రాబాద్ పాతబస్తీలో విషాదం: వరద నీటిలో చిక్కుకొని ఇద్దరు మృతి

Published : Oct 14, 2020, 06:13 PM IST
హైద్రాబాద్ పాతబస్తీలో విషాదం: వరద నీటిలో చిక్కుకొని ఇద్దరు మృతి

సారాంశం

హైద్రాబాద్ ఫలక్‌నుమాలోని అల్లబెల్ కాలనీలో ఇంట్లో వరద నీటిలో చిక్కుకొని ఇద్దరు  మృతి చెందారు.  


హైదరాబాద్: హైద్రాబాద్ ఫలక్‌నుమాలోని అల్లబెల్ కాలనీలో ఇంట్లో వరద నీటిలో చిక్కుకొని ఇద్దరు  మృతి చెందారు.

వరద నీరు ఓ ఇంట్లోకి చేరింది.ఈ నీటిలో ఇద్దరు చిక్కుకొన్నారు. ఈ నీటిలో చిక్కుకొని ఇద్దరు మరణించారు. మరోవైపు ఈ వర్షంతో ఇంటి ప్రహారీగోడ కూలి మరొకరు మృతి చెందారు.

also read:హైద్రాబాద్ అస్మత్ పేట లేక్‌లో వ్యక్తి గల్లంతు

హైద్రాబాద్ నగరంలో భారీ వర్షాలు తీవ్ర ప్రళయాన్ని సృష్టించాయి. నగరంలో ఎక్కడ చూసినా నీళ్లే కన్పిస్తున్నాయి. వరద నీటితో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

హైద్రాబాద్ నగరంలో గత 24 గంటల్లో భారీ వర్ష  పాతం నమోదైంది. నగర శివారులో 32 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరో వైపు నగరంలో 29 సెం.మీల వర్షపాతం నమోదైంది.

భారీ వర్షం కారణంగా  నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పలు చోట్ల కాలనీల్లోకి వర్షం నీరు చేరింది. వర్షంతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
KCR: కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ