ఖానాపూర్‌లో టాటా మ్యూజిక్‌ వాహనంపై కూలిన భారీ వృక్షం.. ఇద్దరు మృతి

Published : Sep 11, 2022, 04:15 PM IST
ఖానాపూర్‌లో టాటా మ్యూజిక్‌ వాహనంపై కూలిన భారీ వృక్షం.. ఇద్దరు మృతి

సారాంశం

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టాటా మ్యాజిక్ వాహనంపై భారీ వృక్షం పడిపోయింది. ఈ ఘటనలో టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టాటా మ్యాజిక్ వాహనంపై భారీ వృక్షం పడిపోయింది. ఈ ఘటనలో టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను జగిత్యాల జిల్లా ఇటిక్యాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరు కుంటాలకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇక, గత రెండు రోజులుగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ వృక్షం నెలకొరిగినట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్