
హైదరాబాద్: Hyderabad కు సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం Gandi Cheruvu Check dam లో పడి ఇద్దరు యువకులు శుక్రవారం నాడు మరణించారు. ఫోటో షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చెక్ డ్యాంలో పడి ఇద్దరు చనిపోయారు. చనిపోయిన వారిని Sudhakar, Naresh గా గుర్తించారు. వీరిద్దరూ హైద్రాబాద్ సనత్ నగర్ వాసులుగా పోలీసులు చెప్పారు. చెక్ డ్యాంలో పడిన ఇద్దరిలో ఒకరిని మృతదేహం లభ్యమైంది. మరొకరి మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పర్యాటక ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాల వద్ద సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు మరణించిన ఘటనలు దేశ వ్యాప్తంగా అనేకం చోటు చేసుకొంటున్నాయి. అయితే ఈ తరహ ప్రాంతాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు, అధికారులు జాగ్రత్తలు తీసకోవాలని కోరుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. సెల్ఫీలు, ఫోటోల మోజులో పడి అజాగ్రత్తగా వ్యవహరించడంతో ప్రాణాలు పోతున్నాయి. అయితే ఇలాంటి ప్రాంతాల్లో పోలీసుల రక్షణ ఏర్పాటు చేసినా కూడా ప్రమాదాలు చోటు చేసుకొన్న సందర్భాలు కూడా లేకపోలేదు.