మహబూబ్ నగర్ జిల్లా నుండి ఇద్దరు సీఎంలు: నాడు బూర్గుల, నేడు రేవంత్ రెడ్డి

By narsimha lodeFirst Published Dec 8, 2023, 1:20 PM IST
Highlights

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రి పదవులు పొందారు. నాడు హైద్రాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు  సీఎం బాధ్యతలు నిర్వహించారు.  నేడు అనుముల రేవంత్ రెడ్డి  సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


హైదరాబాద్:ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి ఇద్దరు ముఖ్యమంత్రులుగా  బాధ్యతలు చేపట్టారు.  హైద్రాబాద్ రాష్ట్రానికి గతంలో  బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.  తెలంగాణ రాష్ట్రానికి  నేడు  అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

బూర్గుల రామకృష్ణారావు  ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూర్గుల స్వగ్రామం. బూర్గుల రామకృష్ణారావు  ఇంటి పేరు పుల్లంరాజు.అయితే  బూర్గుల గ్రామానికి చెందినందున రామకృష్ణారావు  ఇంటి పేరు బూర్గులగా అప్పట్లో పిలిచేవారు. దీంతో  రామకృష్ణారావు ఇంటి పేరు బూర్గులగా మారింది.

Latest Videos


1899 మార్చి 13న నరసింగరావు,రంగనాయకమ్మ దంపతులకు జన్మించారు బూర్గుల రామకృష్ణారావు.  

1952లో  హైద్రాబాద్  రాష్ట్రంలో  తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆనాడు  హైద్రాబాద్ అసెంబ్లీలో  175 స్థానాలున్నాయి. ఆ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ  93 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది.  ఈ ఎన్నికల సమయంలో  కమ్యూనిస్టులపై  నిషేధం ఉంది.  దీంతో కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులు ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్)  పేరుతో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో  కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు 43 స్థానాల్లో విజయం సాధించారు.

1952 మార్చి  6న  బూర్గుల రామకృష్ణారావు  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  బూర్గుల రామకృష్ణారావు  ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  బూర్గుల రామకృష్ణారావు తన పాలనలో  అనేక సంస్కరణలను  ప్రవేశ పెట్టారు.  

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు విషయమై ఆనాడు  చర్చ తెరమీదికి వచ్చింది.  దీంతో  1956లో  ఆంధ్ర రాష్ట్రంలో హైద్రాబాద్ ను విలీనం చేశారు.  ఈ సమయంలో  హైద్రాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కూడ  బూర్గుల రామకృష్ణారావు  కోల్పోవాల్సి వచ్చింది. దీంతో  ఆయనను కేరళ గవర్నర్ గా పంపారు. హైద్రాబాద్ రాష్ట్రానికి  తొలి ముఖ్యమంత్రిగా  పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడు.

also read:జైలుకెళ్లిన నేతలకు ముఖ్యమంత్రి పదవులు: నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేడు రేవంత్...రేపు చంద్రబాబుకు దక్కేనా?

2014 జూన్  2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. 2023 ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా  అనుముల రేవంత్ రెడ్డి  బాధ్యతలు చేపట్టారు.

అనుముల రేవంత్ రెడ్డిది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా.  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి  గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలో  కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది. రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత అంచెలంచెలుగా  అనుముల రేవంత్ రెడ్డి ఎదిగారు.  కాంగ్రెస్ పార్టీలో చేరిన అనతికాలంలోనే  పీసీసీ అధ్యక్షుడిగా  ఎదిగారు. ఈ ఏడాది నవంబర్  30వ తేదీన  రాష్ట్ర శాసనసభకు జరిగిన పోలింగ్ లో  కాంగ్రెస్ పార్టీ  64 స్థానాలు గెలుచుకుంది.  

also read:రాజశ్యామల యాగం చేసినా రాజు కాలేకపోయాడు

భారత రాష్ట్ర సమితి  కేవలం  39 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ ఎనిమిది స్థానాలు,  ఎంఐఎం ఏడు స్థానాలు,సీపీఐ ఒక్క స్థానంలో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష నేతగా రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. దీంతో ఈ నెల  7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

 


 

click me!